తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni At Chepauk Stadium: కేజీఎఫ్‌ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ - ప్రాక్టీస్ సెష‌న్‌కే స్టేడియం ద‌ద్ద‌రిల్లిందిగా

Dhoni at Chepauk Stadium: కేజీఎఫ్‌ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ - ప్రాక్టీస్ సెష‌న్‌కే స్టేడియం ద‌ద్ద‌రిల్లిందిగా

28 March 2023, 8:11 IST

  • Dhoni at Chepauk Stadium: ఐపీఎల్‌లో ధోనీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ పాటిదో మ‌రోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోమ‌వారం సీఎస్‌కే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ధోనీ
ధోనీ

ధోనీ

Dhoni at Chepauk Stadium: ఐపీఎల్ 2023 సీజ‌న్ కోసం ప్రాక్టీస్ సెష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు ధోనీ. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌లో విజ‌యాన్ని ద‌క్కించుకొని నూత‌నోత్సాహంతో ఈ సీజ‌న్‌ను ప్రారంభించేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ధోనీపైనే ఉంది. ధోనీకి ఇదే చివ‌రి ఐపీఎల్‌ సీజ‌న్ కావ‌డంతో క‌ప్ గెలిచి అత‌డికి ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని సీఎస్‌కే ప్లానింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా యంగ్ ప్లేయ‌ర్స్‌తో క‌లిసి ప్రాక్టీస్ సెష‌న్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ధోనీ. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే ప్లేయ‌ర్స్ ప్రాక్టీస్ చేస్తోన్నారు.

సోమ‌వారం ప్రాక్టీస్ సేష‌న్స్ చూసేందుకు అభిమానుల‌కు అనుమ‌తించారు. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టే స‌మ‌యంలో అభిమానుల కేరింత‌లు, అరుపుల‌తో స్టేడియం మొత్తం ద‌ద్ద‌రిల్లిపోయింది. ఈ వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో గ్లోవ్స్ ధ‌రిస్తూ బ్యాట్ ప‌ట్టుకొని స్టైలిష్‌గా ధోనీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తూ క‌నిపిస్తోన్నాడు. కేజీఎల్ స్టైల్‌లో ధోనీ ఎంట్రీ అదిరిపోయింది అంటూ ఈ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడ‌ర్, అత‌డికి ఉన్న క్రేజ్ మ‌రెవ‌రికి లేదంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.