తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Dhoni : ధోనీకి ఎవరూ సాటిలేరు.. అతడొక్కడే

Ravi Shastri On Dhoni : ధోనీకి ఎవరూ సాటిలేరు.. అతడొక్కడే

Anand Sai HT Telugu

31 May 2023, 10:06 IST

    • Ravi Shastri On Dhoni : ఐపీఎల్ 2023 ముగిసింది. ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మిస్టర్ కూల్ మీద రవిశాస్త్రి ప్రశంసలు కురిపంచాడు. ధోనీకి ఎవరూ సాటిలేరని పేర్కొన్నాడు.
ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీ (Twitter)

ఎంఎస్ ధోనీ

ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super KIngs) రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్(IPL Title) గెలుచుకుంది. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే(CSK) జట్టు సాధించిన ఈ ప్రత్యేక అచీవ్‌మెంట్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కెప్టెన్ ధోనీపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు ప్రముఖులు. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) స్పందించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ లెగసీని ఎవరూ సమం చేయలేరన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

జార్ఖండ్‌కు చెందిన ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి దక్షిణాది రాష్ట్రాలు అందిస్తున్న మద్దతు అద్భుతమని రవిశాస్త్రి అన్నాడు. అలాగే 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఎంఎస్ ధోని ఈ ఘనత సాధించడం అతని ఫిట్‌నెస్‌కు నిదర్శనం అని కొనియాడాడు.

'250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఎంఎస్ ధోని ఫిట్‌నెస్‌ సూపర్. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఎంఎస్ ధోని సృష్టించిన రికార్డును ఎవరూ అధిగమించలేరు. తమిళనాడు మొత్తం అతన్ని 'తలా' అని పిలుస్తారు. జార్ఖండ్‌ ఆటగాడికి దక్షిణాది రాష్ట్రాల నుంచి అంత గొప్ప మద్దతు రావడం గ్రేట్.' అని రవిశాస్త్రి అన్నాడు.

ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనీని మరోసారి రిటైర్మెంట్ మీద స్పందించాడు. 'ఈ స్టేజ్‌ నుంచి రిటైరవ్వడం చాలా సులువు.. అయితే మళ్లీ వచ్చి ఆడడం చాలా కష్టం. కానీ అభిమానుల నుంచి నాకు లభించిన అభిమానం దృష్ట్యా కఠిన బాట పట్టాలని నిర్ణయించుకున్నా.. దాని కోసం నేను చాలా కష్టపడాలి. నాకు 6-7 నెలలు సమయం ఉంది. నా ఫిట్ నెస్ ఎలా ఉందో చూడాలి.'అని ధోని అన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అయితే ఈ రికార్డు సృష్టించినప్పటికీ.. ధోనీ చేసిన పని మరోసారి అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ధోనీ అంటే ఇదే కదా అనిపించేలా చేసింది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మీద చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. దీని తర్వాత ట్రోఫీ అందుకునేందుకు ధోనీ వెళ్లాల్సి ఉంది. అయితే అతడితో పాటుగా అంబటి రాయుడు, జడేజాలను కూడా తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2023 ట్రోఫీని వారికే ఇప్పించాడు. దీంతో నెటిజన్లు మరోసారి ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తదుపరి వ్యాసం