IPL 2023 Records : ఈసారి ఐపీఎల్‌లో నమోదైన టాప్-10 రికార్డులు-ipl 2023 records ipl 2023 creates new records heres top 10 records ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ipl 2023 Records Ipl 2023 Creates New Records Here's Top 10 Records

IPL 2023 Records : ఈసారి ఐపీఎల్‌లో నమోదైన టాప్-10 రికార్డులు

ఐపీఎల్ రికార్డులు
ఐపీఎల్ రికార్డులు (Twitter)

IPL 2023 Records : 5 సార్లు IPL టైటిల్ గెలుచుకున్న 2వ జట్టుగా CSK నిలిచింది. ఈ రికార్డుతో పాటు ఈసారి ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. వాటిలో టాప్ 10 రికార్డుల జాబితా ఇలా ఉంది.

IPL సీజన్ 16 ముగిసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. అంతా గుజరాత్ మ్యాచ్ గెలుస్తుందనుకున్న సమయంలో మ్యాచ్ మెుత్తాన్ని చెన్నై వైపు తిప్పాడు జడేజా. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో 5 సార్లు టైటిల్‌ నెగ్గిన 2వ జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఈ రికార్డుతో పాటు ఈసారి ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. అవేంటో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ సిక్సర్ల రికార్డు : ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు నమోదైంది. ఐపీఎల్ 2023లో మొత్తం 1124 సిక్సర్లు కొట్టారు. గతంలో 2022లో 1062 సిక్సర్లు కొట్టడం రికార్డు.

ఫోర్ల రికార్డు : ఐపీఎల్ చరిత్రలో 2023లో అత్యధిక ఫోర్లు కొట్టారు. 2022లో 2018 ఫోర్లు కొట్టగా, ఈసారి 2174 బౌండరీలు వెళ్లాయి.

సెంచరీల రికార్డు : ఈ ఐపీఎల్‌లో ఆటగాళ్లు అత్యధిక సెంచరీలు బాదారు. 2022లో 8 సెంచరీలు ఓ రికార్డు. అయితే ఈసారి ఏకంగా 12 సెంచరీలు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ప్లేయర్స్.

హాఫ్ సెంచరీల రికార్డు : ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు కావడం ఈసారి కూడా ప్రత్యేకమే. ఐపీఎల్ 2023లో మొత్తం 153 అర్ధ సెంచరీలు నమోదు అయ్యాయి. గత సీజన్‌లో అతను 118 అర్ధశతకాలు ఉన్నాయి.

సగటు స్కోరు రికార్డ్ : IPL 16వ సీజన్‌లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 183. ఐపీఎల్ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు. 2018లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 172.

బ్యాట్స్‌మెన్‌ల రికార్డు : ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు సగటున 8.99 పరుగులు చేశారు. 2018లో ఓవర్‌కు సగటున 8.65 పరుగులు చేయడం అత్యుత్తమ రికార్డు. ఈ రికార్డు ఇప్పుడు బద్దలైంది.

డబుల్ సెంచరీ చేజింగ్ : IPL 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు 8 సార్లు చేజ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే గరిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2014లో 200+ స్కోరును 3 సార్లు ఛేజింగ్ చేయడం రికార్డుగా ఉండేది.

బౌలర్ల రికార్డు : ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించారు.

అన్ క్యాప్డ్ ప్లేయర్ల సెంచరీలు : ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్ క్యాప్డ్ ఆటగాళ్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్ మరియు ప్రభాసిమ్రాన్ సింగ్ సెంచరీలతో ప్రత్యేక రికార్డును సృష్టించారు.

WhatsApp channel