IPL 2023 Final : చెన్నై వర్సెస్ గుజరాత్.. టైటిల్ పోరు
IPL 2023 Final CSK Vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనుండగా.. ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు అద్భుత ప్రదర్శన చేసి లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్స్‌లోని క్వాలిఫయర్ మ్యాచ్‌లో టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటంతో ధోనీ(Dhoni) సేన ఫైనల్‌లో మరో భారీ ప్రదర్శనపై నమ్మకంతో ఉంది.
ఇప్పుడు ఈ ఐపీఎల్(IPL)లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తోంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించిన గుజరాత్, తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. కానీ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో వేదికగా తలపడనుంది.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 7 గంటలకు టాస్ వేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో సినిమాలోనూ లైవ్ చూడొచ్చు.
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ ఫైనల్ కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బ్యాటర్‌లకు సూపర్ గా ఉండే ఈ పిచ్ పై అత్యధిక స్కోర్ ఆశించవచ్చు. బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నప్పుడు బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్లు మెరిసే అవకాశం ఉంది.
ప్రాబబుల్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్ : రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ్
గుజరాత్‌బ్ టైటాన్స్ : సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.