తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 | ఫైనల్‌ అహ్మదాబాద్‌.. ప్లేఆఫ్స్‌ కోల్‌కతాలో.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

IPL 2022 | ఫైనల్‌ అహ్మదాబాద్‌.. ప్లేఆఫ్స్‌ కోల్‌కతాలో.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Hari Prasad S HT Telugu

23 April 2022, 21:36 IST

google News
    • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ వేదికలను శనివారం ఖరారు చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ కూడా ఇచ్చారు.
టాటా ఐపీఎల్ ట్రోఫీ
టాటా ఐపీఎల్ ట్రోఫీ

టాటా ఐపీఎల్ ట్రోఫీ

ముంబై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు 100 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ముంబై, పుణెల్లోని నాలుగు స్టేడియాల్లో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లకు కేవలం 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ వేదికలను కూడా ఖరారు చేశారు. మొదట ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతాయని భావించినా.. ఇప్పుడు ప్లాన్‌ మార్చారు. రెండు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగనున్నాయి. తొలి క్వాలిఫయర్‌తోపాటు ఎలిమినేటర్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుండగా.. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. మే 24, 26వ తేదీల్లో తొలి రెండు ప్లేఆఫ్స్‌ జరగనుండగా.. మే 27న రెండో క్వాలిఫయర్‌.. మే 29న ఫైనల్‌ జరగనున్నాయి.

"మే 22న లీగ్‌ స్టేజీ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ నాకౌట్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో 100 శాతం ప్రేక్షకుల సమక్షంలో జరుగుతాయి" అని గంగూలీ శనివారం బీసీసీఏ అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ తర్వాత వెల్లడించారు. ఇక మహిళల ఐపీఎల్‌ తేదీలను కూడా ప్రకటించారు. మూడు టీమ్స్‌తో ఈ లీగ్‌ మే 24 నుంచి 28 వరకూ లక్నోలో జరగనున్నాయి. వుమెన్స్‌ ఛాలెంజర్‌ సిరీస్‌ పేరుతో జరిగే ఈ లీగ్‌ లక్నోలో జరుగుతుందని గంగూలీ చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం