తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wi Vs Ind: ట్రినిడాడ్‌లో వర్షం.. ఇండోర్‌ నెట్స్‌లోనే టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో

WI vs Ind: ట్రినిడాడ్‌లో వర్షం.. ఇండోర్‌ నెట్స్‌లోనే టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో

Hari Prasad S HT Telugu

21 July 2022, 14:57 IST

google News
    • WI vs Ind: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌కు వర్షం అడ్డుపడింది. ప్రాక్టీస్‌ కోసం టీమ్‌ సభ్యుడు గ్రౌండ్‌కు వచ్చినా వర్షం కారణంగా ఇండోర్స్‌లోనే ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చింది.
ఇండోర్ నెట్స్ లో టీమిండియా ప్రాక్టీస్
ఇండోర్ నెట్స్ లో టీమిండియా ప్రాక్టీస్

ఇండోర్ నెట్స్ లో టీమిండియా ప్రాక్టీస్

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో శుక్రవారం తొలి వన్డే జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని యంగిండియా ఇండోర్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసింది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కోహ్లి, బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌లాంటి సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో తొలి వన్డే జరగనుంది. ప్రాక్టీస్‌ కోసం ఇదే గ్రౌండ్‌కు ఉదయాన్నే టీమ్‌ వచ్చినా.. వాళ్లు రాగానే వర్షం మొదలైంది. రెండు గంటల పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో టీమ్‌ ఇండోర్స్‌లో ప్రాక్టీస్‌ చేసింది. ఈ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌లో కెప్టెన్‌ ధావన్‌తోపాటు శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడా, సంజు శాంసన్‌లాంటి క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు.

హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్ కోచ్‌ పరాస్‌ మాంబ్రే టీమ్‌ ప్రాక్టీస్‌ను పర్యవేక్షించారు. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఎక్కువసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న అయ్యర్‌.. ఆ బలహీనత నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో కేవలం శ్రేయస్‌ అయ్యర్‌ కోసమే ఓ అభిమాని రావడం విశేషం.

అతని ఆటోగ్రాఫ్‌ కోసం ఆమె సుమారు రెండు గంటల పాటు వెయిట్‌ చేసింది. టీమ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిసిన తర్వాత అతని దగ్గరికి వెళ్లి చిన్న బ్యాట్‌పై అతని ఆటోగ్రాఫ్‌ తీసుకుంది. తాను అయ్యర్‌కు చాలా పెద్ద అభిమానిని అని ఆమె చెప్పింది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లకు కూడా ఫ్యాన్‌ అని.. వాళ్ల కోసం బ్రియాన్‌ లారా స్టేడియానికి వెళ్తానని చెప్పడం వీడియోలో చూడొచ్చు. రోహిత్‌, రాహుల్‌ ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోయే 5 టీ20ల సిరీస్‌కు ముందు టీమ్‌తో చేరతారు.

తదుపరి వ్యాసం