తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Wi: ఇండియన్ ప్లేయర్స్ ఇన్‌స్టా వీడియో కాల్.. ధోనీ స్పెషల్ అప్పియరెన్స్

Ind vs WI: ఇండియన్ ప్లేయర్స్ ఇన్‌స్టా వీడియో కాల్.. ధోనీ స్పెషల్ అప్పియరెన్స్

Hari Prasad S HT Telugu

27 July 2022, 15:30 IST

google News
    • Ind vs WI: వెస్టిండీస్‌పై ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో కాల్‌తో టైంపాస్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌, వికెట్‌ కీపర్‌ పంత్‌, సూర్యకుమార్ యాదవ్‌లాంటి వాళ్లు సరదాగా గడిపారు.
ఇన్‌స్టా వీడియో కాల్ లో మాట్లాడుతున్న పంత్, సూర్య, రోహిత్
ఇన్‌స్టా వీడియో కాల్ లో మాట్లాడుతున్న పంత్, సూర్య, రోహిత్

ఇన్‌స్టా వీడియో కాల్ లో మాట్లాడుతున్న పంత్, సూర్య, రోహిత్

పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్‌: ఇండియన్‌ టీమ్ ప్లేయర్స్‌ వెస్టిండీస్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటికే టీ20 ప్లేయర్స్‌ కూడా అక్కడికి వెళ్లడంతో అందరూ హోటల్‌లో ఎవరి రూమ్స్‌లో వాళ్లు ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌ ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో కెప్టెన్‌ రోహిత్‌, రిషబ్‌ పంత్, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు ఇతర ప్లేయర్స్‌ కూడా ఉండగా.. మాజీ కెప్టెన్‌ ధోనీ ఇండియా నుంచి స్పెషల్ అప్పియరెన్స్‌ ఇచ్చాడు.

ఇక కొందరు ఫ్యాన్స్‌ కూడా క్రికెటర్లతో లైవ్‌ సెషన్‌లో మాట్లాడారు. ధోనీని ఈ సెషన్‌లో పంత్‌ యాడ్‌ చేయగా.. అతడు మాత్రం ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. అతని భార్య సాక్షి క్రికెటర్లతో మాట్లాడింది. ధోనీ భాయ్‌ను చూపించు అని పంత్‌ కోరగా.. ఆమె చూపించే ప్రయత్నం చేసింది. కానీ ధోనీ మాత్రం కెమెరాకు చెయ్యి అడ్డం పెట్టి తర్వాత కాల్‌ నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఓ అభిమానిని కూడా లైవ్‌ సెషన్‌లోకి తీసుకున్నాడు రిషబ్‌ పంత్. అతడు చాలా ఎక్సైటింగ్‌గా తన ఇంట్లో వాళ్లందరికీ పంత్‌ను చూపిస్తుండగా.. అతని కాల్‌ మధ్యలోనే కట్‌ అయిపోయింది. దీంతో రోహిత్‌ లైన్‌లోకి వచ్చి.. యే రిషబ్‌.. ఏం చేస్తున్నావ్‌ నువ్వు అని అడిగాడు. ఏదో ఫ్యాన్స్‌కు అలా హాయ్‌, హలో చెబుతున్నాను.. అతడు ఖుష్ అయిపోయాడు అని పంత్‌ రిప్లై ఇచ్చాడు.

ఆ తర్వాత కూడా మరికొంత మంది ఫ్యాన్స్‌తో ఈ ముగ్గురు క్రికెటర్లు లైవ్‌లో మాట్లాడారు. ఈ లైవ్‌ చాట్‌లో ఉన్న ప్లేయర్స్‌లో సూర్యకుమార్‌, చహల్‌ ఇప్పటికే వన్డే టీమ్‌లో ఉండగా.. రోహిత్‌, పంత్‌, పాండ్యా, అశ్విన్‌, కుల్దీప్‌, భువనేశ్వర్‌లాంటి వాళ్లు టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ వచ్చారు. ఈసిరీస్‌ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు వన్డే టీమ్‌ మాత్రం బుధవారం జరగబోయే చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

తదుపరి వ్యాసం