తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Thomas Cup | చరిత్ర సృష్టించారు.. తొలిసారి ఇండియన్‌ మెన్స్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌కు గోల్డ్‌

Thomas Cup | చరిత్ర సృష్టించారు.. తొలిసారి ఇండియన్‌ మెన్స్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌కు గోల్డ్‌

HT Telugu Desk HT Telugu

15 May 2022, 15:41 IST

google News
    • ఇండియన్‌ మెన్స్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది. 14సార్లు ఛాంపియన్‌ టీమ్‌ అయిన ఇండోనేషియాను చిత్తుచేసి తొలిసారి థామస్‌ కప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
ఇండియా డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గెలుపు సంబరం
ఇండియా డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గెలుపు సంబరం (AP)

ఇండియా డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గెలుపు సంబరం

బ్యాంకాక్‌: భారత యువ షట్లర్లు అద్భుతమే చేశారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. థామస్‌ కప్‌లో తొలిసారి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేషియా టీమ్‌పై 3-0తో గెలిచింది ఇండియన్‌ మెన్స్‌ టీమ్‌. కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 తేడాతో జొనాథన్‌ క్రిస్టీపై విజయం సాధించడంతో ఇండియన్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది.

ఫైనల్లో ఒక్క మ్యాచూ ఓడకుండానే గోల్డ్‌ గెలవడం విశేషం. అంతకుముందు తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 8-21, 21-17, 21-16 తేడాతో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో ఓడినా... తర్వాత అద్భుతంగా పుంజుకున్న లక్ష్యసేన్‌.. తర్వాతి రెండు గేమ్స్‌లో పోరాడి గెలిచాడు. దీంతో ఇండియన్‌ టీమ్‌కు 1-0 ఆధిక్యం లభించింది.

ఇక ఆ తర్వాత జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ కూడా మూడు గేమ్స్‌పాటు పోరాడి విజయం సాధించింది. ఇండోనేషియా జోడీ మహ్మద్‌ ఎహసాన్‌, కెవిన్‌ సంజయపై 18-21, 23-21, 21-19 తేడాతో భారత జోడీ గెలిచింది. దీంతో టీమ్‌కు కీలకమైన 2-0 లీడ్‌ లభించింది. ఇక మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్‌.. మిగిలిపోయిన పని పూర్తి చేశాడు. వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసి ఇండియన్‌ టీమ్‌కు 3-0తో గోల్డ్‌ మెడల్‌ సాధించిపెట్టాడు.

టాపిక్

తదుపరి వ్యాసం