తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Bangladesh 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ - సిరీస్ క్లీన్‌స్వీప్‌

India vs Bangladesh 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ - సిరీస్ క్లీన్‌స్వీప్‌

25 December 2022, 10:59 IST

google News
  • India vs Bangladesh 2nd Test: ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా విజ‌యాన్ని అందుకున్న‌ది. 145 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిన టీమ్ ఇండియా 74 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయింది. శ్రేయ‌స్ అయ్య‌ర్, అశ్విన్ నిల‌క‌డ‌గా ఆడి భార‌త్‌కు స్ఫూర్తిదాయక‌ విజ‌యాన్ని అందించారు.

అశ్విన్
అశ్విన్

అశ్విన్

India vs Bangladesh 2nd Test: ఇండియా- బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన‌ రెండో టెస్ట్ నాట‌కీయ మ‌లుపుల‌తో ముగిసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అశ్విన్ ప‌ట్టుద‌ల‌గా ఆడి టీమ్ ఇండియాను గెలిపించారు. 145 ప‌రుగుల ఈజీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన టీమ్ ఇండియా 45 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి మూడు రోజును ముగించింది.

నాలుగో రోజు ఆట ఆరంభ‌మైన కొద్ది సేప‌టికే జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ వికెట్‌ను కోల్పోయింది ష‌కీబ్ అత‌డిని పెవిలియ‌న్ పంపించాడు. ఆదుకుంటాడ‌ని అనుకున్న రిష‌బ్ పంత్ కూడా తొమ్మిది ప‌రుగుల‌కే ఔట్ కావ‌డం, మ‌రికొద్ది సేప‌టికే నిల‌క‌డ‌గా ఆడుతున్న అక్ష‌ర్ ప‌టేల్ కూడా వెనుదిర‌గ‌డంతో 74 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా ఓట‌మి దిశ‌గా ప్ర‌యాణించింది.

కానీ అశ్విన్‌తో క‌లిసి శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. నిల‌క‌డ‌గా ఆడి టీమ్‌ ఇండియాకు స్ఫూర్తిదాయ‌క‌ విజ‌యాన్ని అందించారు. అశ్విన్ ధాటిగా బ్యాటింగ్ చేయ‌గా శ్రేయ‌స్ నెమ్మ‌దిగా ఆడాడు. అశ్విన్ 62 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 42 ర‌న్స్ చేయ‌గా, శ్రేయ‌స్ అయ్య‌ర్ 29 ర‌న్స్ చేశాడు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 71 ప‌రుగులు జోడించారు.

బంగ్లాదేశ్ బౌల‌ర్ మెహ‌దీ హ‌స‌న్ ఐదు వికెట్ల‌తో టీమ్ ఇండియాను భ‌య‌పెట్టాడు. ష‌కీబ్ రెండు వికెట్లు తీశాడు. రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 227, సెకండ్ ఇన్నింగ్స్‌లో 231 ప‌రుగులు చేసింది. టీమ్ ఇండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 314 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. విజ‌యంతో టెస్ట్ సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.

తదుపరి వ్యాసం