తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Sri Lanka 1st T20i: చెలరేగిన దీపక్‌, అక్షర్‌, ఇషాన్‌.. శ్రీలంక టార్గెట్‌ 163

India vs Sri Lanka 1st T20I: చెలరేగిన దీపక్‌, అక్షర్‌, ఇషాన్‌.. శ్రీలంక టార్గెట్‌ 163

Hari Prasad S HT Telugu

03 January 2023, 20:46 IST

    • India vs Sri Lanka 1st T20I: దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, ఇషాన్‌ కిషన్‌ చెలరేగడంతో ఇండియా ఫైటింగ్‌ స్కోరు సాధించింది. శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యం ఉంచింది.
ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (PTI)

ఇషాన్ కిషన్

India vs Sri Lanka 1st T20I: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాప్, మిడిలార్డర్‌ విఫలమైనా టీమిండియా ఫైటింగ్‌ స్కోరు సాధించగలిగింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 29 బాల్స్‌లో 37 రన్స్‌ చేయడం.. చివర్లో దీపక్‌ హుడా (23 బాల్స్‌లో 41), అక్షర్‌ పటేల్‌ (20 బాల్స్‌లో 31) చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్‌ టీమ్‌కు మొదట్లోనే షాక్‌ తగిలింది. కెరీర్‌లో తొలి టీ20 ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (7), సంజూ శాంసన్‌ (5) కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 46 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

అయితే ఈ సమయంలో మొదట ఇషాన్‌ కిషన్‌ (29 బాల్స్‌లో 37), హార్దిక్‌ (27 బాల్స్‌లో 29) కూడా ఔటయ్యారు. దీంతో 94 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి ఇండియన్‌ టీమ్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

తదుపరి వ్యాసం