India vs Netherlands Toss: టాస్ గెలిచిన రోహిత్.. ఇండియా బ్యాటింగ్
27 October 2022, 12:32 IST
- India vs Netherlands Toss: ఇండియా, నెదర్లాండ్స్ టాస్ అరగంట ఆలస్యంగా వేశారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆలస్యం కావడంతో టాస్‌లో ఆలస్యం తప్పలేదు.
నెదర్లాండ్స్ మ్యాచ్ లో మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్న ఇండియా
India vs Netherlands Toss: నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలవడంతో తమ ఆత్మవిశ్వాసం చాలా పెరిగిందని టాస్ సందర్భంగా రోహిత్ చెప్పాడు. పిచ్ కాస్త నెమ్మదిగా ఉండే అవకాశం ఉందని అతను అన్నాడు. ఇక ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.
నిజానికి ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేయొచ్చని అంచనా వేసినా.. ఆశ్చర్యకరంగా పాకిస్థాన్‌పై ఆడిన టీమ్‌తోనే దిగుతోంది. అటు నెదర్లాండ్స్ కూడా తొలి మ్యాచ్ ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు చెప్పింది.
తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియా చాలా కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లాలని చూస్తోంది. ఆదివారం (అక్టోబర్ 30) సౌతాఫ్రికాతో మ్యాచ్ జరగనుండటంతో ఈ మ్యాచ్‌ను ఓ మంచి ప్రాక్టీస్‌గా ఇండియా భావించవచ్చు. అంతేకాదు ఫామ్‌లో లేని రోహిత్ శర్మకు కూడా ఇది మళ్లీ గాడిలో పడేందుకు మంచి అవకాశం.
అటు నెదర్లాండ్స్ టీమ్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడింది. తొలి రౌండ్ చివరి మ్యాచ్‌లో నమీబియా ఓడిపోవడంతో అదృష్టవశాత్తూ సూపర్ 12 స్టేజ్‌లోకి ఈ టీమ్ అడుగుపెట్టింది.