తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India In Women's Asia Cup Final: సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ చిత్తు.. ఫైనల్లో ఇండియా

India in Women's Asia Cup Final: సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ చిత్తు.. ఫైనల్లో ఇండియా

Hari Prasad S HT Telugu

13 October 2022, 11:26 IST

    • India in Women's Asia Cup Final: మహిళల ఆసియా కప్‌ ఫైనల్ చేరింది ఇండియన్‌ టీమ్‌. సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇండియన్ ప్లేయర్స్ దీప్తి శర్మ, స్మృతి మంధానా
ఇండియన్ ప్లేయర్స్ దీప్తి శర్మ, స్మృతి మంధానా (BCCI Women Twitter)

ఇండియన్ ప్లేయర్స్ దీప్తి శర్మ, స్మృతి మంధానా

India in Women's Asia Cup Final: ఆసియాకప్‌ లీగ్‌ స్టేజ్‌లో ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలతో టాప్‌లో నిలిచిన ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌.. సెమీఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించింది. థాయ్‌లాండ్‌తో గురువారం (అక్టోబర్‌ 13) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 74 రన్స్‌ తేడాతో సులువుగా విజయం సాధించింది. 149 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన థాయ్‌ టీమ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 రన్స్‌ మాత్రమే చేయగలిగింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీప్తి శర్మ మరోసారి చెలరేగింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 7 రన్స్‌ 3 వికెట్లు తీసుకుంది. ఆమె దెబ్బకు థాయ్‌ టీమ్‌ టాపార్డర్‌ 18 పరుగులకే పెవిలియన్‌ చేరింది. మరో స్పిన్నర్‌ రాజేశ్వర్‌ గైక్వాడ్ కూడా 4 ఓవర్లలో కేవలం 10 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇక రేణుక, స్నేహ్‌, షెఫాలీ తలా ఒక వికెట్‌ తీశారు. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో ఇండియా తలపడనుంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్‌ టీమ్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 28 బాల్స్‌లోనే 42 రన్స్‌ చేసింది. ఇక కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30 బాల్స్‌లో 36 రన్స్‌ చేయగా.. జెమీమా 26 బాల్స్‌లో 27 రన్స్‌ చేసింది. చివర్లో పూజా వస్త్రకర్‌ 13 బాల్స్‌లో 14 రన్స్‌ చేయడంతో ఇండియా ఫైటింగ్‌ స్కోరు సాధించింది. సెమీస్‌లోనూ ఓపెనర్‌ స్మృతి మంధానా (13) మరోసారి నిరాశపరిచింది.