తెలుగు న్యూస్  /  Sports  /  India Defeat New Zealand By 6 Wickets In 2nd T20 Match

IND vs NZ 2nd T20: రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా

29 January 2023, 22:41 IST

  • IND vs NZ 2nd T20: తొలి టీ20లో ఎదురైన ప‌రాభ‌వానికి హార్దిక్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంది. రెండో టీ20లో న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

రాహుల్ త్రిపాఠి
రాహుల్ త్రిపాఠి

రాహుల్ త్రిపాఠి

IND vs NZ 2nd T20: ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విధించిన 99 ప‌రుగులు టార్గెట్‌ను టీమ్ ఇండియా క‌ష్టంగా ఛేదించింది. బౌలింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌లో ఈజీ టార్గెట్‌ను ఛేదించ‌డానికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ తీవ్రంగా శ్ర‌మించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

19. 5 ఓవ‌ర్ల‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 101 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్‌ శుభ్‌మ‌న్ గిల్ 11 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. ఇషాన్ కిష‌న్‌, రాహుల్ త్రిపాఠి నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేయ‌డంతో టీమ్ ఇండియా ప‌ది ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

32 బాల్స్‌లో ఇషాన్ కిష‌న్ 19 ర‌న్స్ చేయ‌గా త్రిపాఠి 18 బాల్స్‌లో 13 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వీరిద్ద‌రి బ్యాటింగ్‌తో టీ20 మ్యాచ్ కాస్త టెస్ట్‌ను త‌ల‌పించింది. ఫ‌స్ట్ టీ20 హీరో వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న సూర్య కుమార్ యాద‌వ్ మాత్రం ప‌ట్టుద‌ల‌తో క్రీజులో నిలిచాడు.

త‌న దూకుడైన ఆట‌తీరుకు భిన్నంగా సింగిల్స్‌, డ‌బుల్స్ చేస్తూ టీమ్ ఇండియాను గెలుపు వైపు న‌డిపించాడు. అత‌డికి కెప్టెన్ హార్దిక్ పాండ్య చ‌క్క‌టి స‌హ‌కారం అందించాడు చివ‌రి ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ ఫోర్‌ కొట్టి ఇండియాకు విజ‌యాన్ని అందించాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ 26 ప‌రుగులు, హార్దిక్ పాండ్య 15 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ఈ గెలుపుతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 తో స‌మం చేసింది టీమ్ ఇండియా.