తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Wtc Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రేసులో టీమ్ ఇండియా - ఆస‌క్తిక‌రంగా మారిన స‌మీక‌ర‌ణాలు

India Wtc Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రేసులో టీమ్ ఇండియా - ఆస‌క్తిక‌రంగా మారిన స‌మీక‌ర‌ణాలు

09 January 2023, 8:52 IST

google News
  • India Wtc Final: వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2023 ఫైన‌ల్ రేసులో టీమ్ ఇండియా నిలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న ఇండియా ఫైన‌ల్ చేర‌డం ఎలా సాధ్య‌మంటే...

టీమ్ ఇండియా
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

India Wtc Final: 2021-23 వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ రేసులో టీమ్ ఇండియా నిలిచింది. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో 75.36 పాయింట్ల‌తో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా 58.93 పాయింట్ల‌తో ఇండియా రెండో స్థానంలో ఉంది.

స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో జ‌రిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా దాదాపు ఫైన‌ల్ బెర్తును ఖాయం చేసుకున్న‌ది. ఆస్ట్రేలియాతో పాటు ఫైన‌ల్ చేరుకునే మ‌రో జ‌ట్టు ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రేసులో ఇండియాకు ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో 58.93 పాయింట్ల‌తో ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉండ‌గా 53.33 పాయింట్ల‌తో శ్రీలంక మూడో స్థానంలో నిలిచింది. ఇండియా ఫైన‌ల్ చేరాలంటే త్వ‌ర‌లో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని టీమ్ ఇండియా 4-0తో క్వీన్ స్వీప్ చేయాలి.

3 -0 , 3-1 తేడాతో విజ‌యాన్ని సాధించినా టీమ్ ఇండియా ఫైన‌ల్ చేరుకుంటుంది. ఒక‌వేళ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేస్తే టీమ్ ఇండియా పాయింట్లు 45.4 స్థానానికి చేరుకొని ఫైన‌ల్ రేసు నుంచి నిష్క్ర‌మిస్తుంది.

2-0 తేడాతో గెలిస్తే…

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని 2-0తో గెలిస్తే టీమ్ ఇండియా పాయింట్లు 60.65కు చేరుకుంటాయి. 2-1 తేడాతో గెలిస్తే 58.8 పాయింట్లు వ‌స్తాయి. అదే జ‌రిగితే టీమ్ ఇండియా ఫైన‌ల్ స‌మీక‌ర‌ణాలు శ్రీలంక - న్యూజిలాండ్ మ‌ధ్య‌జ‌రుగ‌నున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌పై ఆధార‌ప‌డ‌తాయి.

ఈ సిరీస్‌లో శ్రీలంక ఒక్క మ్యాచ్ గెలిచినా టీమ్ ఇండియా ఫైన‌ల్ చేరుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ఒక‌వేళ ఈ సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే ఇండియాతో సంబంధం లేకుండా లంకేయులు ఫైన‌ల్ చేరుకుంటారు.

అలా కాకుండా న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను గెలిస్తే ఇండియా ఫైన‌ల్ బెర్తు ఖాయ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ స‌మీక‌ర‌ణాలు క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి.

తదుపరి వ్యాసం