తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup | ఇండియాకు బ్రాంజ్‌ మెడల్‌.. జపాన్‌పై గెలుపు

Asia Cup | ఇండియాకు బ్రాంజ్‌ మెడల్‌.. జపాన్‌పై గెలుపు

Hari Prasad S HT Telugu

01 June 2022, 16:44 IST

google News
    • డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ఇండియా ఈసారి ఆసియా కప్‌ హాకీలో బ్రాంజ్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించింది.
ఆసియా కప్ హాకీలో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియా
ఆసియా కప్ హాకీలో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియా (Hockey India Twitter)

ఆసియా కప్ హాకీలో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియా

జకార్తా: ఆసియా కప్‌లో ఈసారి గోల్డ్‌ మిస్సయినా ఉత్త చేతులతో మాత్రం మనవాళ్లు వెనక్కి రావడం లేదు. మంగళవారం మూడోస్థానం కోసం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0తో గెలిచి బ్రాంజ్‌ మెడల్ సొంతం చేసుకుంది. ఇండియా తరఫున రాజ్‌కుమార్‌ పాల్‌ తొలి క్వార్టర్‌లోనే గోల్‌ చేశాడు. మ్యాచ్‌ ప్రారంభమైన పదో నిమిషంలో ఈ గోల్ నమోదైంది.

ఇక తర్వాత మూడు క్వార్టర్‌లలో జపాన్‌కు గోల్ సమం చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ గోల్‌ చేసిన వెంటనే ఇండియాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా.. గోల్‌గా మలచలేకపోయింది. అటు తొలి క్వార్టర్‌ ముగిసే చివరి ఐదు నిమిషాల్లో జపాన్‌ పదే పదే ఇండియా గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా మన డిఫెండర్లు అడ్డుకున్నారు. తర్వాతి క్వార్టర్‌లో జపాన్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా.. ఆ టీమ్‌ను గోల్‌ చేయకుండా ఇండియా అడ్డుకోగలిగింది.

ఈసారి టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో అడుగుపెట్టిన ఇండియాకు గోల్డ్ మెడల్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. సోమవారం సౌత్‌ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను 4-4తో డ్రా చేసుకోవడంతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయింది. ఇండియా కంటే గోల్స్‌ ఎక్కువగా ఉన్న సౌత్‌ కొరియా ఫైనల్ చేరింది. గోల్డ్‌ కోసం మలేషియాతో తలపడనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం