తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Commonwealth Games 2022: మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన భార‌త్‌

commonwealth games 2022: మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన భార‌త్‌

HT Telugu Desk HT Telugu

30 July 2022, 7:06 IST

google News
  • కామ‌న్వెల్త్ మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ ఈవెంట్‌లో భార‌త్ జ‌ట్టు శుభారంభం చేసింది. స్టార్ ప్లేయ‌ర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో పాటు డ‌బుల్స్ ఆట‌గాళ్లు రాణించ‌డంతో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను 5-0 తేడాతో భార‌త జ‌ట్టు ఓడించింది.

పీవీ సింధు
పీవీ సింధు (twitter)

పీవీ సింధు

కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భార‌త్ 5-0 తేడాతో ఓడించింది. గ్రూప్ ఏలో భాగంగా జ‌రిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ల్ సింధు, శ్రీకాంత్ సింగిల్స్ లో రాణించ‌డంతో భార‌త్ పై చేయి సాధించింది.తొలి మ్యాచ్ లో డబుల్ ప్లేయర్స్ అశ్వినీ పొన్నప్ప, సుమిత్ రెడ్డి 21-9 21-12 తేడాతో విజయాన్ని సాధించి ఇండియాకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.

ఆ తర్వాత కిదాంబి శ్రీకాంత్ 21-7 21-12 తేడాతో మురాద్ అలీని ఓడించాడు. మూడో మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ సింధు దూకుడైన ఆటతో మహూర్ షెహజాద్ ను బెంబేలేత్తించింది. 21-7 21-6 తేడాతో మహూర్ పై సింధు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు డబుల్స్ మ్యాచ్ లలో రకిరెడ్డి శెట్టి, త్రిష జాలీ, గాయత్రి గోపిచంద్ జోడి విజయాల్ని అందుకోవడంలో 5-0 తేడాతో పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తదుపరి మ్యాచ్ లలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో భారత జట్టు తలపడనున్నది.

తదుపరి వ్యాసం