తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India At T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడే మ్యాచ్‌లు ఇవే.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

India at T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడే మ్యాచ్‌లు ఇవే.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

14 October 2022, 10:34 IST

    • India at T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు ఏవి? వాటిని ఎప్పుడు ఎక్కడ చూడాలన్న సందేహం చాలా మంది అభిమానుల్లో ఉండే ఉంటుంది. మరి రోహిత్‌ సేన షెడ్యూల్‌ ఏంటో ఒకసారి చూసేద్దాం.
పెర్త్ లో టీమిండియా ప్రాక్టీస్
పెర్త్ లో టీమిండియా ప్రాక్టీస్ (BCCI twitter)

పెర్త్ లో టీమిండియా ప్రాక్టీస్

India at T20 World Cup 2022: క్రికెట్‌ లవర్స్‌ సుమారు నెల రోజుల పాటు బిజీ కానున్నారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే టీ20 ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌- అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆ పండగ ఇప్పుడు మరోసారి వచ్చేస్తోంది. ఆదివారం (అక్టోబర్‌ 16) నుంచే ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. శ్రీలంక, నమీబియా మధ్య తొలి రౌండ్‌ మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ మొదలవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే ఇండియా మాత్రం తన తొలి మ్యాచ్‌ను ఆ వచ్చే ఆదివారం (అక్టోబర్‌ 23) పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా గ్రూప్‌ 2లో ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా కూడా ఉన్నాయి. ఇవి కాకుండా తొలి రౌండ్‌ ముగిసిన తర్వాత మరో రెండు క్వాలిఫయర్‌ టీమ్స్‌ కూడా గ్రూప్‌ 2లో చేరనున్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా షెడ్యూల్‌

ఇండియా vs పాకిస్తాన్‌ - అక్టోబర్‌ 23, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌)

ఇండియా vs ఎ2 - అక్టోబర్‌ 27, గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు (సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌)

ఇండియా vs సౌతాఫ్రికా - అక్టోబర్‌ 30, ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు (పెర్త్‌ స్టేడియం)

ఇండియా vs బంగ్లాదేశ్‌ - నవంబర్‌ 2, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు (అడిలైడ్‌ ఓవల్‌)

ఇండియా vs బీ1 - నవంబర్‌ 6, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌)

ఎక్కడ చూడాలి?

ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ బ్రాడ్‌కాస్ట్‌ హక్కులను స్టార్‌ నెట్‌వర్క్‌ సొంతం చేసుకుంది. ఇండియాలో స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్స్‌లో టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై చూడాలనుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ల లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉంటుంది. ఇండియా ఆడే మ్యాచ్‌లు దూరదర్శన్‌లోనూ లైవ్‌ టెలికాస్ట్‌ ఉంటుంది.

టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియా టీమ్‌ ఇదే

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్ పంత్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

స్టాండ్‌బై ప్లేయర్స్‌: మహ్మద్‌ షమి, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌

తదుపరి వ్యాసం