తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Navdeep Saini : నేను సెలక్ట్ అయ్యానోచ్.. వెస్టిండీస్‌ టూర్​పై నవదీప్ సైనీ కామెంట్స్

Navdeep Saini : నేను సెలక్ట్ అయ్యానోచ్.. వెస్టిండీస్‌ టూర్​పై నవదీప్ సైనీ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

24 June 2023, 11:33 IST

google News
    • IND Vs WI : వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును శుక్రవారం ప్రకటించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని బలమైన జట్టును ఈ సిరీస్‌కు ఎంపిక చేయగా, కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా ఇక్కడ అవకాశం లభించింది.
నవదీప్ సైనీ
నవదీప్ సైనీ (twitter)

నవదీప్ సైనీ

త్వరలో టీమిండియా(Team India).. వెస్టిండీస్‌కు వెళ్లనుంది. కొంతమంది యువ ఆటగాళ్లు సైతం ఎంపికయ్యారు. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్న ఓ ఫాస్ట్ బౌలర్ అతడి ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాలో తన ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పేసర్ ఎవరో కాదు నవదీప్ సైనీ(Navadeep Saini). కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమైన నవదీప్ సైనీ.. తనకు భారత జట్టు నుంచి పిలుపు వచ్చిందని ఆనందాన్ని పంచుకున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు యూకే వచ్చిన నవదీప్ సైనీ.. ఈ వార్త విని ఆశ్చర్యపోయానని స్పందించాడు.

'నేను కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఈ రోజు ఇక్కడకు వచ్చాను. విమానాశ్రయం నుండి బయలుదేరిన తర్వాత, వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు నేను ఎంపికైనట్లు నాకు తెలిసింది. నిజాయితీగా, నేను ఈ ఎంపికను ఊహించలేదు. నేను ఐపిఎల్‌లో డ్యూక్స్ బాల్‌తో ప్రాక్టీస్ చేసాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో నేను నెట్ బౌలర్‌గా ఎంపిక కావచ్చని అనుకున్నాను.' అని నవదీప్ సైనీ అన్నాడు.

వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)కు ముందు కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని, వెస్టిండీస్ సిరీస్‌కు ఇది మంచి సన్నాహకమని సైనీ చెప్పాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా.. ఇక్కడ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తే వెస్టిండీస్ పర్యటనకు మంచి సన్నాహకమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

'వెస్టిండీస్‌కు ఇది నా రెండో పర్యటన. నాకు చివరిసారి ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అక్కడి వాతావరణం గురించి నాకు తెలుసు. పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి.' అని సైనీ చెప్పుకొచ్చాడు.

టీమిండియా టెస్టు జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షరు పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

తదుపరి వ్యాసం