తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa T20: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

Ind vs SA T20: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

Hari Prasad S HT Telugu

28 September 2022, 20:40 IST

google News
    • Ind vs SA T20: చెలరేగిన బౌలర్లు. Ind vs SA T20: టీమిండియా పేస్‌ బౌలర్లు చెలరేగడంతో తొలి టీ20లో సౌతాఫ్రికా 106 రన్స్‌తో సరిపెట్టుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్‌ టాపార్డర్‌ దారుణంగా విఫలమైంది. అయితే టెయిలెండర్లు పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
సౌతాఫ్రికా బ్యాటర్ల పని పట్టిన ఇండియన్ బౌలర్లు
సౌతాఫ్రికా బ్యాటర్ల పని పట్టిన ఇండియన్ బౌలర్లు (AP)

సౌతాఫ్రికా బ్యాటర్ల పని పట్టిన ఇండియన్ బౌలర్లు

Ind vs SA T20: సౌతాఫ్రికాతో తిరువనంతపురంలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దీంతో సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 రన్స్‌ మాత్రమే చేయగలిగారు. పవర్‌ ప్లేలోనే అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్‌ చహర్‌లు సౌతాఫ్రికా టాపార్డర్‌ను దెబ్బతీయడంతో ఆ టీమ్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఒక దశలో 9 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయినా.. కేశవ్‌ మహరాజ్‌ (41), మార్‌క్రమ్‌ (25), పార్నెల్‌ (24) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది.

టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, దీపక్‌ చహర్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ వికెట్‌ తీయకపోయినా.. 4 ఓవర్లలో కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి సౌతాఫ్రికాను కట్టడి చేశాడు. మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా 4 ఓవర్లలో 16 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియాకు తొలి ఓవర్‌ చివరి బంతికే దీపక్‌ చహర్‌ శుభారంభం అందించాడు. అతడు సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా(0)ను ఔట్‌ చేశాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్‌ చేశాడు.

అతని దెబ్బకు డికాక్‌ (1), రూసో (0), మిల్లర్‌ (0) ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్‌.. స్టబ్స్‌ (0)ను కూడా ఔట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్‌ 3, చహర్‌ 2 వికెట్లు తీసుకున్నారు. ఈ ఇద్దరి దెబ్బకు నలుగురు బ్యాటర్లు డకౌట్‌ కాగా.. అందులో ముగ్గురు తొలి బంతికే పెవిలియన్‌ చేరారు.

ఈ సమయంలో ఏడెన్‌ మార్‌క్రమ్‌, వేన్‌ పార్నెల్‌ ఆరో వికెట్‌కు కీలకమైన 33 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా టీమ్‌ కోలుకుంది. ఈ ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ.. ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. మార్‌క్రమ్‌ 25 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 26 రన్స్‌ జోడించిన పార్నెల్‌ కూడా 24 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు.

తదుపరి వ్యాసం