తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shami Return 4th Test: నాలుగు టెస్ట్ లో ష‌మీ రీఎంట్రీ - సిరాజ్‌కు రెస్ట్‌?

Shami Return 4th Test: నాలుగు టెస్ట్ లో ష‌మీ రీఎంట్రీ - సిరాజ్‌కు రెస్ట్‌?

05 March 2023, 9:08 IST

  • Shami Return 4th Test: మార్చి 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న‌ నాలుగో టెస్ట్ కోసం తుది జ‌ట్టులో టీమ్ ఇండియా మార్పులు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. సిరాజ్ స్థానంలో ష‌మీని ఆడించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ష‌మీ
ష‌మీ

ష‌మీ

Shami Return 4th Test: ఇండోర్ టెస్ట్ ప‌రాజ‌యం నేప‌థ్యంలో కీల‌క‌మైన నాలుగో టెస్ట్ కోసం టీమ్ ఇండియా తుది జ‌ట్టులో మార్పులు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

మూడో టెస్ట్ లో విశ్రాంతి పేరుతో ష‌మీని టీమ్ మేనేజ్‌మెంట్ ప‌క్క‌న‌పెట్టింది. అత‌డి స్థానంలో ఉమేష్ యాద‌వ్‌కు అవ‌కాశం ఇచ్చారు. స్పిన్‌కు స‌హ‌క‌రించిన పిచ్‌పై ఉమేష్ యాద‌వ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆక‌ట్టుకున్నాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. అత‌డిని నాలుగో టెస్ట్‌లోనూ కొన‌సాగించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మూడో టెస్ట్‌కు దూర‌మైన ష‌మీని నాలుగు టెస్ట్ కోసం తుది జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. సిరాజ్‌ స్థానంలో ష‌మీని ఆడించే యోచ‌న‌లో టీమ్ మేనెజ్‌మెంట్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఆస్ట్రేలియాతో మార్చి 17 నుంచి ప్రారంభంకానున్న‌ వ‌న్డే సిరీస్ కోసం సిరాజ్‌నుఎంపిక‌చేశారు. ఈ వ‌న్డే సిరీస్‌కు ముందు సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలనే ఆలోచ‌న‌తోనే నాలుగు టెస్ట్ నుంచి అత‌డిని ప‌క్క‌న‌పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు మిడిల్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యం టీమ్ ఇండియాను ఇబ్బందిపెడుతోంది. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, వికెట్ కీప‌ర్ భ‌రత్ ప‌రుగులు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌వుతోన్నారు. అయ్య‌ర్ స్థానంలో సూర్య‌కుమార్‌ను నాలుగో టెస్ట్ కోసం ఎంపిక‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా మార్చి 9 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ సిరీస్‌లో ప్ర‌స్తుతం 2 -1 తేడాతో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది

తదుపరి వ్యాసం