తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc 3 Schedule: డబ్ల్యూటీసీ 3 షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ: టీమిండియా ఏఏ జట్లతో ఆడనుందంటే..

WTC 3 Schedule: డబ్ల్యూటీసీ 3 షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ: టీమిండియా ఏఏ జట్లతో ఆడనుందంటే..

14 June 2023, 21:10 IST

google News
    • WTC 2023-25 Schedule: డబ్ల్యూటీసీ 3 షెడ్యూల్ సైకిల్‍ను ఐసీసీ ప్రకటించింది. ఈ సైకిల్‍లో ఇండియా విదేశాల్లో 9 టెస్టులు ఆడనుంది.
టీమిండియా
టీమిండియా (BCCI Twitter)

టీమిండియా

WTC 2023-25 Cycle Schedule: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) రెండో ఎడిషన్ ఇటీవలే ముగిసింది. ఫైనల్‍లో ఇండియాపై గెలిచిన ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంది. దీంతో డబ్ల్యూటీసీ 3వ సైకిల్ షెడ్యూల్‍ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. 2023 నుంచి 2025 మధ్య ఈ మూడో ఎడిషన్ డబ్ల్యూటీసీ సైకిల్ జరగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‍తో డబ్ల్యూటీసీ 3 సైకిల్ ఈ వారంలో షురూ కానుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో టీమిండియా ఏఏ జట్లతో ఆడనుందంటే..

వెస్టిండీస్‍ పర్యటనలో ఆ జట్టుతో వచ్చే నెల జరగనున్న రెండు టెస్టుల సిరీస్‍తో డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍ను టీమిండియా ప్రారంభించనుంది. ఆ తర్వాత డిసెంబర్ 2023 నుంచి జనవరి 2024 మధ్య దక్షిణాఫ్రికాలో ఆ టీమ్‍తో ఇండియా రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం 2024 జనవరి - ఫిబ్రవరి మధ్య స్వదేశంలో ఇంగ్లండ్‍తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‍కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం 2024 సెప్టెంబర్ - అక్టోబర్‌ మధ్య బంగ్లాదేశ్‍తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత న్యూజిలాంజ్‍తో స్వదేశంలో మూడు టెస్టులు ఆడనుంది భారత జట్టు.

ఇక 2024 నవంబర్ - 2025 జనవరి మధ్య ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనుంది టీమిండియా. ఈ టూర్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‍తో ఐదు టెస్టులను ఆడనుంది. ఈ సిరీస్‍తో 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్‍ను భారత్ పూర్తి చేసుకుంటుంది.

మొత్తంగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‍లతో (10 టెస్టులు) ఆడనుంది. విదేశాల్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో (9 మ్యాచ్‍లు) తలపడనుంది.

డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍లో ఆస్ట్రేలియా తన స్వదేశంలో తొమ్మిది మ్యాచ్‍లు ఆడనుండగా.. విదేశాల్లో 10 ఆడనుంది. ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో 10, వేరే దేశాల్లో 11 టెస్టుల్లో బరిలోకి దిగనుంది.

మొత్తంగా డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. ప్రతీ జట్టు స్వదేశం, విదేశాల్లో టెస్టులు ఆడనున్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఎక్కువ పాయింట్లు సాధించిన టాప్-2 జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‍కు చేరుకుంటాయి. ఆ ఫైనల్‍లో గెలిచిన టీమ్‍కు డబ్ల్యూటీసీ టైటిల్ దక్కుతుంది.

కాగా, 2021-23 డబ్ల్యూటీసీ ఇటీవలే ఈనెలలోనే ముగిసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‍ జరిగింది. తుది పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో గెలిచి, టైటిల్ దక్కించుకుంది.

తదుపరి వ్యాసం