తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hyderabad Wwe Event : రేపే హైదరాబాద్ లో Wwe సూపర్ ఫైట్, తొలిసారి బరిలో దిగుతున్న జాన్ సెనా!

Hyderabad WWE Event : రేపే హైదరాబాద్ లో WWE సూపర్ ఫైట్, తొలిసారి బరిలో దిగుతున్న జాన్ సెనా!

07 September 2023, 14:07 IST

google News
    • Hyderabad WWE Event : WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ హైదరాబాద్ వేదికైంది. రేపు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ సూపర్ ఫైట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ పోటీపడుతున్నారు.
హైదరాబాద్ లో WWE ఈవెంట్
హైదరాబాద్ లో WWE ఈవెంట్

హైదరాబాద్ లో WWE ఈవెంట్

Hyderabad WWE Event : హైదరాబాద్ వేదికగా తొలిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) నిర్వహిస్తున్నారు. రేపు(సెప్టెంబర్ 8) గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 8న డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, ఉమెన్ ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో పాటు కీలక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు సూపర్‌స్టార్స్ జిందర్ మహల్, వీర్, సంగ కూడా బరిలోకి దిగుతున్నారు.

WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్

ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ అయిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ తొలిసారి హైదరాబాద్ లో జరగబోతుండడంతో నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లు ఒక్క రోజులోనే అమ్ముడయ్యాయంటే...వీటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 8న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి లైవ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియప్ రియా రిప్లే, సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ తదితర రెజ్లింగ్ స్టార్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

హైదరాబాద్ పోటీల్లో జాన్ సెనా

హైదరబాద్ జరుగనున్న వ‌రల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్టైన్మెంట్ ఈవెంట్ లో పాల్గొనేందుకు మల్టీ టైమ్ ఛాంపియన్ జాన్ సెనా భారత్​ రాబోతున్నట్లు సమాచారం. రేపు హైదరాబాద్‌లో జరుగనున్న సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో ఈవెంట్ లో మొదటిసారిగా జాన్ సెనా రెజ్లింగ్​ పోటీల్లో పాల్గొన‌నున్నారు. జాన్ సెనా భారత్​కు రావ‌డం ఇది రెండోసారి కాగా పోటీల్లో పాల్గొనడం తొలిసారి. 2006లో మొదటిసారి భారత్ పర్యటనకు వచ్చిన జాన్ సెనా ముంబయిలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. తాను భారత్ వస్తున్నట్లు జాన్ సెనా స్వయంగా ట్విట్టర్ లో ధ్రువీకరించారు. 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జాన్ సెనా భారతదేశంలో మొదటిసారిగా రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్ లో WWE అభిమానులను కలవడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని జాన్ సెనా చెప్పారు.

తదుపరి వ్యాసం