తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hong Kong Player Propose: గ్రౌండ్‌లోనే గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన హాంకాంగ్‌ ప్లేయర్‌.. వీడియో

Hong Kong Player Propose: గ్రౌండ్‌లోనే గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన హాంకాంగ్‌ ప్లేయర్‌.. వీడియో

Hari Prasad S HT Telugu

01 September 2022, 11:41 IST

    • Hong Kong Player Propose: గ్రౌండ్‌లోనే గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేశాడు ఓ హాంకాంగ్‌ ప్లేయర్‌. ఈ వీడియోను ఏషియా క్రికెట్‌ కౌన్సిల్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది వైరల్‌ అవుతోంది.
గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేస్తున్న కించిత్ షా
గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేస్తున్న కించిత్ షా (Twitter)

గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేస్తున్న కించిత్ షా

Hong Kong Player Propose: క్రికెట్‌లో హాంకాంగ్‌ టీమ్‌ పసికూనే కావచ్చు. కానీ ఆసియాకప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో మంచి ఫైట్‌ ఇచ్చింది. ఇండియాలాంటి టీమ్‌పై హాంకాంగ్‌ పోరాడిన తీరు అద్భుతం. 193 రన్స్‌ టార్గెట్‌ చేజింగ్‌లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 రన్స్‌ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే మ్యాచ్‌ అంతా ఒకెత్తయితే.. మ్యాచ్‌ తర్వాత హాంకాంగ్‌ ప్లేయర్‌ గ్రౌండ్‌లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయడం విశేషం. ఆ టీమ్‌ బ్యాటర్‌ కించిత్‌ షా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన వీడియోను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ షేర్‌ చేసింది. ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. స్టాండ్స్‌లో ఉన్న ఆమె వెనుక నుంచి వెళ్లిన కించిత్‌.. సడెన్‌గా మోకాళ్లపై కూర్చొని విల్‌ యు మ్యారీ మీ అంటూ అడిగాడు.

అతన్ని చూసి ఆమె షాక్‌లో మునిగిపోయింది. వెంటనే ఓకే చెప్పింది. "ఆమె ఎస్‌ చెప్పింది. ఇండియాతో మ్యాచ్ తర్వాత హాంకాంగ్‌ ప్లేయర్‌ కించిత్‌ షా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన ఈ మూమెంట్‌ హృదయాన్ని తాకింది. ఈ హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు. మీ కొత్త జీవితంలో సంతోషం కలగాలని కోరుకుంటున్నాం" అని ఏసీసీ ఈ వీడియోను షేర్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో కించిత్‌ షా 28 బాల్స్‌లో 30 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఇండియాలాంటి టీమ్‌పై ఇది నిజంగా మంచి ఇన్నింగ్సే. ఇక ఆ తర్వాత ఈ మ్యాచ్‌ను మరింత మరుపురానిదిగా చేసుకోవడానికి కించిత్‌ షా ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయడం.. ఆమె దానికి ఓకే చెప్పడం విశేషం. కించిత్‌కు తోడు బాబర్‌ హయత్‌ (41) కూడా పోరాడటంతో హాంకాంగ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 రన్స్‌ చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం