Hong Kong Gift to Kohli: విరాట్ కోహ్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హాంకాంగ్ టీమ్-hong kong teams special gift to virat kohli after the asia cup match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hong Kong Gift To Kohli: విరాట్ కోహ్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హాంకాంగ్ టీమ్

Hong Kong Gift to Kohli: విరాట్ కోహ్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హాంకాంగ్ టీమ్

Hari Prasad S HT Telugu
Sep 01, 2022 10:46 AM IST

Hong Kong Gift to Kohli: విరాట్ కోహ్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది హాంకాంగ్‌ టీమ్‌. బుధవారం (ఆగస్ట్‌ 31) మ్యాచ్‌ తర్వాత ఆ టీమ్ ప్లేయర్స్‌ ఈ గిఫ్ట్‌ను కోహ్లికి అందించారు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (BCCI Twitter)

Hong Kong Gift to Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి మెల్లగా పూర్తిస్థాయి ఫామ్‌లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 35 రన్స్‌ చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 44 బాల్స్‌లో 59 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. ఆరు నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌పై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అతనితోపాటు సూర్యకుమార్‌ మెరుపులతో ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 40 రన్స్‌తో ఇండియా గెలిచింది. అయితే మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా హాంకాంగ్‌ టీమ్ ప్లేయర్స్‌ ఎంతో గొప్ప మనసు చాటుకున్నారు. మ్యాచ్‌ తర్వాత తమ అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ ఏంటో తెలుసా? హాంకాంగ్‌ టీమ్‌ జెర్సీ. దీనిపై ఓ స్పెషల్ మెసేజ్‌ కూడా వాళ్లు రాశారు.

"ఓ జనరేషన్‌ను ఇన్‌స్పైర్‌ చేసినందుకు థ్యాంక్యూ. మేము నీతోనే ఉంటాము. రానున్నవి చాలా అద్భుతమైన రోజులు. ప్రేమతో టీమ్‌ హాంకాంగ్‌" అనే సందేశాన్ని ఆ జెర్సీపై రాసి మ్యాచ్‌ తర్వాత కోహ్లికి అందించారు. ఈ స్పెషల్‌ గిఫ్ట్‌పై ఎంతో ఆనందం వ్యక్తం చేసిన విరాట్‌ కోహ్లి.. తర్వాత ఆ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేయడం విశేషం.

"థ్యాంక్యూ హాంకాంగ్‌ టీమ్‌. మీ అభిమానం ఎంతో వినయపూర్వకంగా, చాలా స్వీట్‌గా ఉంది" అంటూ కోహ్లి ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ హాఫ్‌ సెంచరీ చేయడంతో ఇక అతడు ఫామ్‌లోకి వచ్చేసినట్లే అని ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తనదైన షాట్లతో అలరించాడు. అయితే మరోవైపు సూర్య ఆకాశమే హద్దు చెలరేగడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ మరుగున పడిపోయింది.

ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏమిటంటే.. హాంకాంగ్‌ చేజ్‌ చేస్తున్న సమయంలో 17వ ఓవర్‌ను విరాట్‌ కోహ్లియే వేశాడు. అప్పటికే మ్యాచ్‌లో విజయం దాదాపు ఖాయం కావడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. బాల్‌ను విరాట్‌కు అందించాడు. అతడు ఆ ఓవర్లో కేవలం 6 రన్స్‌ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఆసియా కప్‌ సూపర్‌ 4 స్టేజ్‌లో భాగంగా ఈ నెల 4వ తేదీన ఇండియా తన తర్వాతి మ్యాచ్‌ ఆడనుంది. హాంకాంగ్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లోని విజేతతో ఇండియా తలపడనుంది.

<p>విరాట్ కోహ్లి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ</p>
విరాట్ కోహ్లి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (Instagram)
WhatsApp channel