తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hockey World Cup Ind Vs Nz: హాకీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ముగిసిన ఇండియా పోరాటం - న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి

Hockey World Cup IND vs NZ: హాకీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ముగిసిన ఇండియా పోరాటం - న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి

22 January 2023, 22:32 IST

  • Hockey World Cup IND vs NZ: హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పూల్ ద‌శ‌లోనే ఇండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది.

ఇండియా హాకీ టీమ్‌
ఇండియా హాకీ టీమ్‌

ఇండియా హాకీ టీమ్‌

Hockey World Cup IND vs NZ: హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ 3-3 గోల్స్‌తో టై కావ‌డంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్ ఐదు గోల్స్ చేయ‌గా ఇండియా నాలుగు గోల్స్ మాత్ర‌మే చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ గెలుపుతో న్యూజిలాండ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ చేరుకోగా ఇండియా టీమ్‌ వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌పై ఇండియా టీమ్ సంపూర్ణ‌ ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. 18వ నిమిషంలో ల‌లిత్ కుమార్ గోల్‌తో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 22వ నిమిషంలో నిల‌కాంత్ శ‌ర్మ గోల్ చేసినా గోల్ పోస్ట్ లోకి వెళ్ల‌డానికి ముందు బాల్ బేస్ లైన్ దాటడంతో ఫౌల్‌గా అంపైర్ ప్ర‌క‌టించాడు.

ఆ త‌ర్వాత 25వ నిమిషంలో ల‌భించిన పెనాల్టీ కార్న‌ర్‌ను సుఖ్‌జీత్ గోల్‌గా మ‌ల‌చ‌డంతో ఇండియా 2-0తో లీడ్‌లో నిలిచింది. సెకండ్ క్వార్ట‌ర్ ముగుస్తుంద‌న‌గా న్యూజిలాండ్ తొలి గోల్ చేసింది. ఆ త‌ర్వాత 42వ నిమిషంలో వ‌రుణ్ గోల్‌తో ఇండియా ఆధిక్యం 3-1కి చేరుకుంది.

ఈ మ్యాచ్ ఇండియా గెలుపు ఖాయం అనుకుంటున్న త‌రుణంలో చివ‌ర‌లో విజృంభించిన న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు వ‌రుస‌గా రెండు గోల్స్ చేయ‌డంతో స్కోరు 3-3తో స‌మ‌మైంది. పెనాల్టీ షూటౌట్‌లో 4-5తో ఇండియాపై న్యూజిలాండ్ విజ‌యాన్ని సాధించి క్వార్ట‌ర్ ఫైన‌ల్ చేరుకున్న‌ది.

టాపిక్