తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya | అతడితో మాట్లాడిన తర్వాత గేమ్‌పై గౌరవం పెరిగింది: హార్దిక్

Hardik Pandya | అతడితో మాట్లాడిన తర్వాత గేమ్‌పై గౌరవం పెరిగింది: హార్దిక్

25 May 2022, 9:13 IST

    • గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తన సహచర ఆటగాడు డేవిడ్ మిల్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనను కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గి గుజరాత్ ఐపీఎల్2022 ఫైనల్‌కు చేరింది.
హార్దిక్ పాండ్య-డేవిడ్ మిల్లర్
హార్దిక్ పాండ్య-డేవిడ్ మిల్లర్ (PTI)

హార్దిక్ పాండ్య-డేవిడ్ మిల్లర్

గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రం చేసిన సీజన్‌లోనే పైనల్‌కు చేరి అరుదైన ఘనత సాధించింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల ఘన విజయం సాధించి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చివర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అతడి ప్రదర్శనపై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు.. డేవిడ్ మిల్లర్ తవ టీమ్‌లో ఉండటం గర్వంగా ఉందని కితాబిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"డేవిడ్ మిల్లర్‌తో మాట్లాడిన తర్వాత గేమ్ పట్ల నాకు గౌరవం ఏర్పడింది. ఈ విషయం అతడికి కూడా చెప్పాను. అతడిని చూస్తే గర్వంగా అనిపించింది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ సమయంలో ఓడినా ఇద్దరం కలిసే ముగిద్దాం అని నాతో చెప్పాడు. నిజంగా అప్పుడు గర్వంగా అనిపించింది." అని హార్దిక్ పాండ్య తెలిపాడు. ఐపీఎల్‌లో తన ఫామ్ గురించి మాట్లాడుతూ.. జట్టుకు తన అవసరం ఎప్పుడున్నా అప్పుడు బ్యాటింగ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు.

"క్రికెటర్‌గా నేను ఎప్పుడు టీమ్‌కు అవసరమో అప్పుడు ఆడే బ్యాటర్‌ను. బ్యాటింగ్‌లో నేను సక్సెస్ కానప్పటికీ.. జట్టుకు అవసరమైన చోట ఆడి విజయం సాధించాను. ఆటగాళ్లు ఎప్పుడు పరుగులు చేయాలో అందుకు అనుగుణంగా మా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఒక్కో సారి 20 పరుగులు కూడా మ్యాచ్ విన్నింగ్‌ రన్స్ కావచ్చు. టోర్నీ ప్రారంభంలో గెలవాలనే బరిలోకి దిగాము." అని హార్దిక్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వీరోచిత పోరాటంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ వరుసగా మూడు సిక్సర్లు బాది గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో మూడు బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. మిల్లర్ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్య 40 పరుగులతో బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ఓబెడ్ మెకాయ్ చెరో వికెట్ తీశారు.

టాపిక్

తదుపరి వ్యాసం