తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya Rare Record: టీ20 క్రికెట్ లో హార్దిక్ పాండ్య రేర్ రికార్డ్

Hardik Pandya Rare Record: టీ20 క్రికెట్ లో హార్దిక్ పాండ్య రేర్ రికార్డ్

24 October 2022, 13:42 IST

  • Hardik Pandya Rare Record: పాకిస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య బ్యాటింగ్ మెరుపులతో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్ తో పాండ్య అరుదైన రికార్డ్స్ నెలకొల్పాడు. 

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

హార్దిక్ పాండ్య

Hardik Pandya Rare Record: టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 రౌండ్ తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్ పై అద్భుత విజయాన్ని అందుకున్నది టీమ్ ఇండియా. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (Virat kohli), హార్ధిక్ పాండ్య అసమాన బ్యాటింగ్ తో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపు బాట పట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్ లో మూడు వికెట్లతో పాటు నలభై పరుగులు చేసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు పాండ్య. ఈ క్రమంలో టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో 1000 రన్స్ పూర్తిచేసుకున్నాడు.

టీ20ల్లో వెయ్యి పరుగులు, యాభై వికెట్లు తీసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా పాండ్య రికార్డ్ సృష్టించాడు. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ ఘనతను సాధించిన ఎనిమిదో క్రికెటర్ పాండ్య మాత్రమే. 74 మ్యాచుల్లో పాండ్య ఈ ఘనతను అందుకున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు పాండ్య 989 రన్స్ తో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 37 బాల్స్ లో 40 రన్స్ చేశాడు.

కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ తో రాణించిన పాండ్యపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. పునరాగమనం తర్వాత పాండ్య ఆటతీరులో చాలా మార్పు కనిపిస్తుందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.

సాధారణంగా ఓవర్ కు పదికిపైగా రన్ రేట్ చేయాల్సిన సమయంలో ప్రతి ప్లేయర్ లో ఒత్తిడి, భయం కనిపిస్తాయని, కానీ పాండ్య మాత్రం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడని మెచ్చుకున్నాడు.

తదుపరి వ్యాసం