తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gunshots Heard In England Team Hotel: ఇంగ్లాండ్ టీమ్ హోట‌ల్‌కు స‌మీపంలో కాల్పుల క‌ల‌క‌లం

Gunshots Heard in England Team Hotel: ఇంగ్లాండ్ టీమ్ హోట‌ల్‌కు స‌మీపంలో కాల్పుల క‌ల‌క‌లం

09 December 2022, 8:08 IST

google News
  • Gunshots Heard in England Team Hotel: ఇంగ్లాండ్ - పాకిస్థాన్ మ‌ధ్య రెండో టెస్ట్ శుక్ర‌వారం (నేటి) నుంచి ముల్తాన్ వేదిక‌గా ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్స్ బ‌స చేసిన హోట‌ల్‌కు స‌మీపంలో గురువారం ఉద‌యం తుపాకీ కాల్పుల శ‌బ్దాలు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్
ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్

ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్

Gunshots Heard in England Team Hotel: శుక్ర‌వారం (నేటి) నుంచి పాకిస్థాన్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య ముల్తాన్ వేదిక‌గా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్‌లో విజ‌యాన్ని సాధించి జోరు మీదున్న‌ది ఇంగ్లాండ్‌. సెకండ్ టెస్ట్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. మ‌రోవైపు సొంత గ‌డ్డ‌పై ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పాకిస్థాన్ భావిస్తోంది.

ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇరుజ‌ట్లు స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు బ‌స చేస్తోన్న హోట‌ల్‌కు అత్యంత స‌మీపంలో తుపాకీ కాల్పుల శ‌బ్దాలు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. గురువారం ఉద‌యం ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ప్రాక్టీస్ సెష‌న్ కోసం రెడీ అవుతోన్న‌ స‌మ‌యంలో ఈ కాల్పుల శ‌బ్దాలు వినిపించాయి.

దాంతో ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు. కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే పాకిస్థాన్ పోలీసులు న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. కాల్పుల ఘ‌ట‌న‌తో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు సెక్యూరిటీ మ‌ధ్య ప్రాక్టీస్‌లో పాల్గొన్న‌ట్లు స‌మాచారం. పాకిస్థాన్‌లో ప‌ర్య‌టిస్తోన్న ఇంగ్లాండ్ ప్లేయ‌ర్స్‌కు ప్రెసిడెంట్‌ స్థాయి సెక్యూరిటీని అంద‌చేస్తున్నారు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఒక మార్పుతో బ‌రిలో దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆల్‌రౌండ‌ర్ లివింగ్‌స్టోన్ గాయ‌ప‌డ‌టంతో అత‌డిన స్థానంలో మార్క్‌వుడ్‌ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలిసింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

తదుపరి వ్యాసం