Fifa 2022 Golden Boot Winner: ఫిఫా వరల్డ్ కప్ 2022 గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ విన్నర్స్ వీరే
19 December 2022, 8:06 IST
Fifa 2022 Golden Boot Winner:ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. ఈ వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులు ఎవరికి దక్కాయంటే...
ఎంబాపే
Fifa 2022 Golden Boot Winner: ఫిఫా వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. స్టార్ ప్లేయర్ మెస్సీ మ్యాజిక్‌తో పాటు గోల్ కీపర్ మార్జినేజ్ అద్భుత ప్రదర్శనతో అర్జెంటీనాకు వరల్డ్ కప్‌ను అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేయగా...ఫ్రాన్స్ తరఫున ఎంబాపే ఒక్కడే మూడు గోల్స్ చేశాడు. మెస్సీ రెండో గోల్స్ కొట్టడంతో 80వ నిమిషం వరకు అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఒక నిమిషం వ్యవధిలోనే ఎంబాపే రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అదనపు సమయంలో రెండు టీమ్‌లు తలో గోల్ చేయడంలో స్కోరు 3-3తో సమమైంది. పెనల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌ఫై అర్జెంటీనా విజయాన్ని అందుకున్నది.
ఈ వరల్డ్ కప్‌లో ఎనిమిది గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డ్ అందుకున్నాడు.
వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో గోల్స్ చేసిన ఐదో ఆటగాడిగా ఎంబాపే రికార్డ్ క్రియేట్ చేశాడు. గత ఫైనల్‌లో క్రొయేషియాపై ఎంబాపే గోల్ చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక గోల్స్ ఏకైక ప్లేయర్‌గా ఎంబాపే నిలిచాడు.
వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 12 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో పీలేతో సమానంగా 6వ స్థానంలో నిలిచాడు.
హయ్యెస్ట్ గోల్ స్కోరర్‌గా ఎంబాపే తర్వాత స్థానంలో ఏడు గోల్స్‌తో మెస్సీ నిలిచాడు. అతడికి గోల్డెన్ బాల్ అవార్డ్ దక్కింది. ఫైనల్ మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు (26 మ్యాచ్‌లు).
ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో మెస్సీ 13 గోల్స్ చేశాడు. మిరోస్లోవ్, రొనాల్డో, ముల్లర్ తర్వాత వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు.
వరల్డ్ కప్ అన్ని స్టేజ్ మ్యాచ్‌లలో గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా మెస్సీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఈ వరల్డ్ కప్‌లో గోల్డెన్ గ్లోవ్స్ అవార్డ్ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌కు దక్కింది.
బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డ్ అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండేజ్ అందుకున్నాడు.