తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 France Squad: వరల్డ్‌కప్‌ టీమ్‌ ప్రకటించిన డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌

FIFA World Cup 2022 France Squad: వరల్డ్‌కప్‌ టీమ్‌ ప్రకటించిన డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌

Hari Prasad S HT Telugu

10 November 2022, 11:17 IST

    • FIFA World Cup 2022 France Squad: వరల్డ్‌కప్‌ టీమ్‌ను ప్రకటించింది డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌. 25 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను బుధవారం (నవంబర్ 9) రాత్రి అనౌన్స్‌ చేసింది.
ఫిఫా వరల్డ్ కప్ లో ఆడబోయే ఫ్రాన్స్ టీమ్ ఇదే
ఫిఫా వరల్డ్ కప్ లో ఆడబోయే ఫ్రాన్స్ టీమ్ ఇదే (French Team Twitter)

ఫిఫా వరల్డ్ కప్ లో ఆడబోయే ఫ్రాన్స్ టీమ్ ఇదే

FIFA World Cup 2022 France Squad: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అడుగుపెట్టబోతోంది ఫ్రాన్స్‌. 2018లో ఛాంపియన్‌గా నిలిచిన ఆ టీమ్‌.. తాజాగా బుధవారం (నవంబర్‌ 9) 25 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది. ఈ టీమ్‌లో ఊహించినట్లే స్టార్‌ ప్లేయర్స్‌ అందరూ చోటు దక్కించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కరీమ్‌ బెంజెమా, కిలియన్‌ ఎంబప్పె, ఆంటోనీ గ్రీజ్‌మన్‌, రఫేల్‌ వారేన్‌లాంటి వాళ్లంతా ఫ్రాన్స్‌ టీమ్‌లో ఉన్నారు. ప్రస్తుతం గాయంతో దూరంగా ఉన్న రఫేల్‌ వారేన్‌ కూడా వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు సంపాదించాడు. మేనేజర్‌ దిదియెర్‌ డెస్‌ఛాంప్స్‌ ఈ టీమ్‌ను అనౌన్స్‌ చేశాడు. అయితే స్టార్‌ మిడ్‌ఫీల్డర్లు పాల్‌ పోగ్బా, ఎన్‌గోలో కాంటేలాంటి ప్లేయర్స్‌ గాయాలతో దూరం కావడం ఫ్రాన్స్‌కు మింగుడు పడటం లేదు.

దీంతో ఫ్రాన్స్‌ మిడ్‌ఫీల్డ్‌ కాస్త బలహీనమైంది. ఎడుయార్డో కామావింగా, అరెలియెన్‌ చౌమెనిలాంటి యువ ప్లేయర్స్‌ ఫ్రాన్స్‌ మిడ్‌ఫీల్డ్‌ భారాన్ని మోయనున్నారు. ఫ్రాన్స్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌లో ముగ్గురు గోల్‌ కీపర్లు, తొమ్మిది మంది డిఫెండర్లు, ఆరుగురు మిడ్‌ఫీల్డర్లు, ఏడుగురు అటాకర్లు ఉన్నారు.

గోల్‌కీపర్లు: ఆల్ఫోన్స్‌ అరియోలా, హూగో లోరిస్, స్టీవ్‌ మండాండా

డిఫెండర్స్‌: లూకాస్‌ హెర్నాండెజ్, థియో హెర్నాండెజ్, ప్రెస్నెల్‌ కిమ్‌పెంబె, ఇబ్రహిమా కొనాటె, జూలెస్‌ కౌండె, బెంజమిన్‌ పవార్డ్‌, విలియమ్‌ సలీబా, డేయట్‌ ఉపమెకానో, రఫేల్‌ వెరేన్‌

మిడ్‌ఫీల్డర్స్‌: ఎడుయార్డో కామావింగా, అరెలియెన్‌ చౌమెని, యూసుఫ్‌ ఫొఫానా, మాటియో గెండౌజీ, అడ్రియెన్‌ రాబియోట్, జోర్డాన్‌ వెరెటౌట్‌

ఫార్వర్డ్స్‌: కరీమ్‌ బెంజెమా, కింగ్స్‌లీ కోమన్‌, ఉస్మాన్‌ డెంబెలె, ఒలీవర్‌ గిరౌడ్, ఆంటోనీ గ్రీజ్‌మన్‌, కిలియన్‌ ఎంబప్పె, క్రిస్టొఫర్‌ ఎన్‌కుంకు

ఫిఫా వరల్డ్‌కప్‌ నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకూ ఖతార్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 32 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఖతార్‌లోని 8 స్టేడియాల్లో ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తదుపరి వ్యాసం