Fifa World Cup 2022 Day 7 Schedule: ఫిఫా వరల్డ్ కప్ ఏడో రోజు షెడ్యూల్ ఇదే - సౌదీ అరేబియా మరో సంచలనం సృష్టిస్తుందా
26 November 2022, 7:50 IST
Fifa World Cup 2022 Day 7 Schedule: ఫిఫా వరల్డ్ కప్‌లో శనివారం (నవంబర్ 26)న నాలుగు మ్యాచ్‌లు జరుగనున్నాయి . ఇంగ్లాండ్‌తో అమెరికా తలపడనుండగా ఫ్రాన్స్‌ను డెన్మార్క్ ఢీ కొట్టబోతున్నది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాపై సంచలన విజయాన్ని నమోదు చేసిన సౌదీ అరేబియా శనివారం పోలాండ్‌తో సమరానికి సిద్ధమైంది.
సౌదీ అరేబియా వర్సెస్ పోలాండ్
Fifa World Cup 2022 Day 7 Schedule: ఫిఫా వరల్డ్ కప్‌లో శనివారం నాలుగు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో అమెరికా తలపడనుంది. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ ఒక విజయం, మరో డ్రాతో గ్రూప్ బీలో టాపర్‌గా ఉంది. అమెరికా ఆడిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. నేటి మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లాండ్ సూపర్ 16 రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు సూపర్ 16 రౌండ్ రేసులో నిలవాలంటే అమెరికాకు ఈ విజయం తప్పనిసరిగా మారింది.
మరో మ్యాచ్ ట్యునీషియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఈ రెండు టీమ్‌లు వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు బోణీ చేయలేదు. ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4-1 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది ఆస్ట్రేలియా. ఆ పరాభవం తాలూకు ప్రభావం నుంచి ట్యునీషియా మ్యాచ్ ద్వారా బయటపడాలని చూస్తోంది. ట్యునీషియా స్టార్ ప్లేయర్ ఎల్లీస్ స్కిరీపైనే ఎక్కువగా ఆధారపడింది.
మరో మ్యాచ్‌లో పోలాండ్‌ను సౌదీ అరేబియా ఢీకొట్టబోతున్నది . ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై సంచలన విజయాన్ని సాధించింది సౌదీ అరేబియా. గ్రూప్ సీలో టాపర్‌గా నిలిచింది. పోలాండ్‌పై ఆ ఫలితాన్ని పునరావృతం చేసి తొలిసారి వరల్డ్ కప్ సూపర్ 16 రౌండ్‌లో అడుగుపెట్టాలని సౌదీ అరేబియా భావిస్తోంది. అయితే పోలాండ్ నుంచి సౌదీ అరేబియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
శనివారం చివరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో డెన్మార్క్ తలపడనుంది. గ్రూప్ డీలో ఫ్రాన్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆ జోరును నేటి మ్యాచ్‌లో కొనసాగించాలని ఫ్రాన్స్ అభిమానులు కోరుకుంటున్నారు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఫ్రాన్స్, డెన్మార్క్ రెండు సార్లు తలపడగా రెండింటిలో ఫ్రాన్స్ గెలిచింది.
ఫిఫా వరల్డ్ కప్ ఏడో రోజు షెడ్యూల్ ఇదే...
ఇంగ్లాండ్ వర్సెస్ అమెరికా
ట్యునీషియా వర్సెస్ ఆస్ట్రేలియా
సౌదీ అరేబియా వర్సెస్ పోలాండ్
ఫ్రాన్స్ వర్సెస్ డెన్మార్క్