FIFA+ | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. 'ఫిఫా+' లాంచ్.. ఇదేంటో తెలుసా?
12 April 2022, 19:57 IST
- FIFA+ వచ్చేసింది. ఇది నిజంగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్తే. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫ్రీగా ఫుట్‌బాల్ లైవ్ మ్యాచ్‌లు చూసే ఛాన్స్ ఉండటం విశేషం.
ఫిఫా+ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఇదే
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. FIFA+ అనే కొత్త డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. అంటే ఇది కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్‌లాంటిదే. అయితే దీనికి ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. పైగా ఏడాదికి 40 వేలకుపైగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తి ఉచితంగా. లైవ్ మ్యాచ్‌లను కూడా చూడొచ్చు.
అంతేకాదు ఇప్పటి వరకూ జరిగిన అన్ని మెన్స్, వుమెన్స్ వరల్డ్‌కప్‌ల మ్యాచ్‌లను కూడా ఈ ఫిఫా+పై చూసే వీలుంటుంది. ఇవి కాకుండా డాక్యుమెంటరీలను కూడా క్రియేట్ చేసి అందిస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్‌లాంటి భాషల్లో ఈ ఫిఫా+ అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సందర్భంగా ఫ్యాన్స్ కోసం బ్రెజిల్ మాజీ ప్లేయర్ రొనాల్డినోపై క్రియేట్ చేసిన డాక్యుమెంటరీని అందించింది.
లైవ్ మ్యాచ్‌లు మాత్రం కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంటాయి. ఆయా దేశాల్లో ఇప్పటికే చేసుకున్న బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాలను గౌరవించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా చెప్పింది. అయితే ఈ మ్యాచ్‌లతోపాటు హైలైట్స్ అన్నీ తర్వాత ఈ ఫిఫా+లో అందుబాటులో ఉంటాయి. ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా జరిగే సుమారు 1400 మ్యాచ్‌లను లైవ్‌స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులోని కంటెంట్ మొత్తాన్ని ఫ్రీగా అభిమానులకు ఇవ్వాలని భావిస్తున్న ఫిఫా.. అడ్వర్‌టైజింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికే కాదు.. ఇది ఎప్పటికీ ఉచితంగా ఇస్తామని ఫిఫా స్పష్టం చేసింది.
టాపిక్