తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Federer Nadal To Team Up: ఫెదరర్‌ చివరి మ్యాచ్‌.. నదాల్‌తో కలిసి ఆడనున్న స్విస్ మాస్టర్‌

Federer Nadal to team up: ఫెదరర్‌ చివరి మ్యాచ్‌.. నదాల్‌తో కలిసి ఆడనున్న స్విస్ మాస్టర్‌

Hari Prasad S HT Telugu

22 September 2022, 18:51 IST

  • Federer Nadal to team up: ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ను తన చిరకాల ప్రత్యర్థి నదాల్‌తోనే కలిసి ఆడనున్నాడు. ఈ విషయాన్ని గురువారం (సెప్టెంబర్‌ 22) లేవర్‌ కప్‌ ఆర్గనైజర్లు ధృవీకరించారు.

లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్ లో కలిసి ఆడనున్న ఫెదరర్, రఫేల్ నదాల్
లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్ లో కలిసి ఆడనున్న ఫెదరర్, రఫేల్ నదాల్ ( Reuters)

లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్ లో కలిసి ఆడనున్న ఫెదరర్, రఫేల్ నదాల్

Federer Nadal to team up: టెన్నిస్‌ గ్రేట్‌, స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను మరుపురాని విధంగా ముగించనున్నాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ను అతడు తన చిరకాల ప్రత్యర్థి, స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నదాల్‌తో కలిసి ఆడనున్నాడు. ఈ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌కు లండన్‌ వేదిక కానుంది. లేవర్‌ కప్‌లో భాగంగా ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్‌ చేతులు కలపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఫెదరర్‌, నదాల్‌ కలిసి ఆడనున్నట్లు లేవర్‌ కప్‌ నిర్వాహకులు గురువారం (సెప్టెంబర్‌ 22) వెల్లడించారు. ఈ ఇద్దరూ టీమ్‌ యూరప్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. లేవర్‌ కప్‌ అనేది ఓ టీమ్‌ ఈవెంట్‌. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రేట్‌ టెన్నిస్‌ ప్లేయర్స్‌ తలపడతారు. ఈసారి టీమ్‌ యూరప్‌, టీమ్‌ వరల్డ్‌ మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది.

యూరప్‌ టీమ్‌కు టెన్నిస్‌ లెజెండ్‌ జాన్‌ బోర్గ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టీమ్‌లో ఫెదరర్‌, నదాల్‌తోపాటు 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విన్నర్‌ జోకొవిచ్‌, బ్రిటన్‌ గ్రేట్‌ ఆండీ ముర్రే కూడా ఉన్నారు. ఇక టీమ్‌ వరల్డ్‌ను మరో గ్రేట్‌ ప్లేయర్‌ జాన్‌ మెకన్రో లీడ్‌ చేయనున్నాడు. గురువారం నిర్వాహకులు లేవర్‌ కప్‌ తొలి రోజు షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

శుక్రవారం (సెప్టెంబర్‌ 23) తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌ 5 కాస్పర్‌ రూడ్‌, అమెరికా ప్లేయర్‌ జాక్‌ సాక్‌ తలపడనున్నారు. ఇక తొలి రోజు రెండో మ్యాచ్‌లో సిట్సిపాస్‌, డీగో ష్వార్ట్జ్‌మ్యాన్‌ ఆడనున్నారు. ఇక శుక్రవారం చివరి మ్యాచ్‌లో ఫెదరర్‌, నదాల్‌ కలిసి డబుల్స్‌ బరిలో దిగుతారు. ఈ ఇద్దరూ సాక్‌, టియాపో జోడీతో ఆడనున్నారు.

ఈ లేవర్‌ కప్‌ తర్వాత తాను రిటైరవుతున్నట్లు సెప్టెంబర్‌ 15నే ఫెదరర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇక తన చివరి మ్యాచ్‌ను తన చిరకాల ప్రత్యర్థి నదాల్‌తో కలిసి ఆడే అవకాశం వస్తే చాలా బాగుంటుందని కూడా అతడు అన్నాడు. అందుకు తగినట్లే యూరప్‌ టీమ్‌ కెప్టెన్‌ బోర్గ్‌.. ఈ ఇద్దరికీ కలిసి ఆడే అవకాశం ఇచ్చాడు.

తదుపరి వ్యాసం