Roger Federer in Laver Cup: చివరిసారి ఆడుతున్న ఫెదరర్‌.. లేవర్‌ కప్‌ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?-roger federer in laver cup playing his last tournament when and where to watch ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Roger Federer In Laver Cup Playing His Last Tournament When And Where To Watch

Roger Federer in Laver Cup: చివరిసారి ఆడుతున్న ఫెదరర్‌.. లేవర్‌ కప్‌ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu
Sep 16, 2022 04:35 PM IST

Roger Federer in Laver Cup: టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్ ఫెదరర్‌ చివరిసారి ఆడుతుంటే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. లేవర్‌ కప్‌లో ఆడబోతున్న ఈ స్విస్‌ మాస్టర్‌ మ్యాచ్‌లను ఎప్పుడు? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

రోజర్ ఫెదరర్ (ఫైల్ ఫొటో)
రోజర్ ఫెదరర్ (ఫైల్ ఫొటో) (AP)

Roger Federer in Laver Cup: టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌లో ఒకడైన రోజర్‌ ఫెదరర్‌ రిటైరవుతున్నట్లు గురువారం (సెప్టెంబర్‌ 15) ప్రకటించిన విషయం తెలుసు కదా. వచ్చే వారం లేవర్‌ కప్‌లో ఆడి ఇక ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపాడు.24 ఏళ్ల పాటు టెన్నిస్‌ కోర్టులో అద్భుతాలు చేసిన ఫెడెక్స్‌ను ఈ చివరి టోర్నీలో ఆడుతుంటే చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఫెదరర్‌ ఆడబోయే లేవర్‌ కప్‌ ఎప్పుడు?

ఏటీపీ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఈ లేవర్‌ కప్‌లో రోజర్‌ ఫెదరర్‌ టీమ్‌ యూరప్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీ లండన్‌లో సెప్టెంబర్‌ 23 నుంచి 25 వరకూ జరగనుంది. ఈ లేవర్‌ కప్‌లో తన సమకాలీకులైన యూరప్‌ గ్రేట్‌ ప్లేయర్స్‌ రఫేల్‌ నదాల్‌, నొవాక్‌ జోకొవిచ్‌, ఆండీ ముర్రేలతో కలిసి ఫెదరర్‌ ఆడబోతుంటం విశేషం. దీంతో ఈ టోర్నీపై మరింత ఆసక్తి పెరిగింది.

రిటైర్మెంట్‌ తర్వాత కూడా తాను టెన్నిస్‌ ఆడతానని, అయితే గ్రాండ్‌స్లామ్స్‌ లేదా టూర్‌లలో మాత్రం ఆడబోనని ఫెదరర్‌ స్పష్టం చేశాడు. చివరిసారి వింబుల్డన్‌ 2021 క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఫెడెక్స్‌ ఆడాడు. ఆ తర్వాత మోకాలిగాయంతో మరోసారి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలో ఫెదరర్‌ మోకాలికి ఇది మూడో సర్జరీ కావడం గమనార్హం.

లేవర్‌ కప్‌ ఎక్కడ చూడాలి?

లేవర్‌ కప్‌ ఇండియాలో కూడా లైవ్‌ రాబోతోంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఈ లేవర్‌ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టీవీ ఛానెళ్లతోపాటు సోనీ లివ్‌ ఓటీటీలోనూ లేవర్‌ కప్‌ లైవ్‌ వస్తుంది. వీటిలో ఫెదరర్‌ చివరిసారి ఆడబోతున్న ఏటీపీ టూర్‌ మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు.

24 ఏళ్ల కెరీర్‌లో రోజర్‌ ఫెదరర్‌ మొత్తం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచాడు. ఎప్పుడో 2012లోనే 17 టైటిల్స్‌తో ఉన్న అతడు ఈ పదేళ్లలో కేవలం మూడు గ్రాండ్‌స్లామ్స్‌ మాత్రమే గెలిచాడు. అతని కంటే ఎంతో వెనక ఉన్నట్లు కనిపించిన రఫేల్‌ నదాల్ (22), నొవాక్‌ జోకొవిచ్‌ (21) ఇప్పుడు అతన్ని దాటి ముందుకెళ్లిపోయాడు.

WhatsApp channel