Roger Federer vs Rafael Nadal Rivalry: చిరకాల ప్రత్యర్థుల పోటీ ఇక సమాప్తం.. వీరి పోరు అసామాన్యం.. అద్వితీయం -roger federer and rafael nadal iconic rivalry come to an end amid federer retirement ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Roger Federer Vs Rafael Nadal Rivalry: చిరకాల ప్రత్యర్థుల పోటీ ఇక సమాప్తం.. వీరి పోరు అసామాన్యం.. అద్వితీయం

Roger Federer vs Rafael Nadal Rivalry: చిరకాల ప్రత్యర్థుల పోటీ ఇక సమాప్తం.. వీరి పోరు అసామాన్యం.. అద్వితీయం

Maragani Govardhan HT Telugu
Sep 15, 2022 10:32 PM IST

Federer Retirement: రోజర్ ఫెదర్-రఫెల్ నాదల్ మధ్య టెన్నిస్ మ్యాచ్ జరుగుతుందంటే అభిమానులు చాలా ఆత్రుతతో చూసేవారు. అయితే ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటనతో వీరి మధ్య పోటీ కూడా ముగియనుంది.

<p>నాదల్-ఫెదరర్</p>
నాదల్-ఫెదరర్ (AFP)

Roger Federer Federer and Rafael Nadal Rivalry: టెన్నిస్‌లో చిరకాల ప్రత్యర్థులంటే రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదలే(Rafael Nadal) గుర్తుకు వస్తారు. రెండు దశాబ్దాలుగా వీరిద్దరూ ఎప్పుడు తలపడుతున్నా టెన్నిస్ అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. నువ్వా, నేనా అంటూ సాగే ఈ పోరులో తమ అభిమాన క్రీడాకారుడే గెలవాలని ఇరువురి ఫ్యాన్స్ కోరుకుంటారు. వీరిద్దరిని కలిపి ముద్దుగా ఫెదల్(Fedal) అయితే ఈ రవత్తరం మ్యాచ్‌లు ఇకపై జరగవు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో టెన్నిస్ ప్రియులకు నిరాశే మిగలనుంది.

ఫెదరర్-నాదల్ మధ్య మ్యాచ్‌ను అభిమానులు టెన్నిస్ గేమ్‌లా కాకుండా.. బాక్సింగ్‌లో జోయ్ ఫ్రేజియర్-మహమ్మద్ అలీ, అథ్లెటిక్స్‌లో టైసన్ గే-ఉస్సేన్ బోల్ట్ పోరు వలే చూస్తారు. టెన్నిస్ చరిత్రలో ఏ ఆటగాళ్లకు కూడా ఈ విధమైన హైప్ క్రియేట్ కాలేదు. ఫెదరర్-నాదల్ ఇద్దరూ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో వరుసగా ఆరేళ్ల పాటు కొనసాగి రికార్డు సృష్టించారు. ఫెదరర్ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు నాదల్ మెరుగ్గా రాణించాడు. మిగిలిన ఆటగాళ్లు వీరి ముందు అత్యంత సాధారణంగా కనిపించారు.

2004 మార్చి 16న అప్పటికే ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్న రోజర్ ఫెదరర్.. 17 ఏళ్ల రఫెల్ నాదల్‌తో తొలిసారి తలబ్డాడు. అయితే ఇది సింగిల్స్ మ్యాచ్ కాదు.. డబుల్స్ గేమ్. ఇండియన్ వెల్స్ మ్యాచ్‌ అయిన ఈ గేమ్‌లో నాదల్ జట్టు 5-7, 6-4, 6-3 తేడాతో గెలిచింది. అయితే వీరిద్దరూ ముఖాముఖి తలపడినప్పుడు ఫెదరరే పైచేయి సాధించారు. స్విస్ స్టార్ 24 సార్లు గెలవగా.. నాదల్ 16 సార్లు మాత్రమే విజయం సాధించాడు.

నెంబర్లలో ఫెదరర్‌దే ఆధిపత్యం..

ఈ దిగ్గజ ఆఠటగాళ్లు ఇద్దరూ ముఖాముఖి 30 సార్లు తలపడితే.. 24-16 తేడాతో ఫెదరర్ లీడ్‌లో ఉన్నాడు. ఫైనల్స్‌లోనూ స్విస్ స్టారే 14-10 తేడాతో ముందు వరుసలో ఉన్నాడు. వీరిద్దరూ హార్డ్ కోర్టులో 20(16 ఎర్రమట్టి, 4 పచ్చగడ్డి) సార్లు ముఖాముఖి తలపడ్డారు. అయితే ఎర్రమట్టి కోర్టు రారాజుగా పిలిచే నాదల్.. అందులో ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 14 విజయాలతో ముందుండగా.. ఫెదరర్ 2 విజయాలనే సొంతం చేసుకున్నాడు. మరోపక్క పచ్చగడ్డి కోర్టులో ఫెదరర్ 3-1 తేడాతో జైత్రయాత్రను కొనసాగించాడు. ఇండోర్ హార్ట్ కోర్టులో 5-1 తేడాతో ఫెదరర్ ముందున్నాడు.

ఫెదరర్-నాదల్ పోటీ కేవలం గణాంకాలకు సంబంధించింది కాదు. ఎందుకంటే గెలుపొటములకు తేడా అంగుళం మాత్రమే. కానీ ఆ అంగుళం కూడా తేడా లేకుండా ఈ దిగ్గజ ఆటగాళ్లిద్దరూ ఆధునిక టెన్నిస్ క్రీడను అత్యుత్తమ దశలో నిలిపారు.

ఫెదరర్ గెలిచిన టైటిల్స్..

ప్రొఫెషనల్స్ కెరీర్‌లో రోజర్ ఫెదరర్.. 103 ఏటీపీ టైటిళ్లను సాధించాడు. ఇందులో 20 గ్రాండ్‌స్లామ్‌లు, 6 మాస్టర్స్, 28 మాస్టర్స్ 1000, 24 ఏటీపీ 500, 25 ఏటీపీ 250 టైటిళ్లు గెలిచాడు. దీంతో పాటు అదనంగా 2014 డేవిస్ కప్‌లో స్విస్ టీమ్‌ను గెలిపించాడు. ఇది కాకుండా 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ విభాగంలో స్టాన్ వావ్రాంకతో కలిసి గోల్డ్ గెలిచాడు. ఇక పరాజయాల వద్దకు వస్తే.. స్విస్ స్టార్ 54 ఫైనల్స్‌లో ఓడి పోయాడు. ఇందులో 11 గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి.

<p>2006 వింబుల్డన్ లో విన్నర్ ట్రోఫీతో ఫెదరర్, రన్నర్ ట్రోఫీతో నాదల్</p>
2006 వింబుల్డన్ లో విన్నర్ ట్రోఫీతో ఫెదరర్, రన్నర్ ట్రోఫీతో నాదల్ (AP)
Whats_app_banner

సంబంధిత కథనం