Rafael Nadal in US Open 2022: యూఎస్ ఓపెన్‌లో నాదల్‌కు షాక్.. నాలుగో రౌండ్‌లో ఓటమి
Frances Tiafoe beats Rafael Nadal: యూఎస్ ఓపెన్ నాలుగో రౌండులో రఫెల్ నాదల్.. ఫ్రాన్సీస్ టోయాఫే చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగు సెట్లలో మూడింటిని సొంతం చేసుకున్న ఫ్రాన్సీస్.. నాదల్‌కు ఊహించని ఓటమిని అందించాడు.
Frances Tiafoe beats Rafael Nadal: ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ 2022లో సెమీస్ మ్యాచ్‌కు ముందే గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అతడు తన ఆశలన్నీ యూఎస్ ఓపెన్‌పైనే పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలోనూ అతడికి రిక్త హస్తాలే మిగిలాయి. నాలుగో రౌండులో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు. పురుషుల్ సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు సెట్లలో మూడింటిని సొంతం చేసుకుని అద్భుత విజయాన్ని చెలాయించి అదిరిపయే విజయాన్ని అందుకున్నాడు ఫ్రాన్సిస్.
ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్సీస్.. నాదల్‌ను 6-4. 4-6, 6-4 6-3 తేడాతో విజయం సాధించాడు. 24 ఏళ్ల అమెరికన్ ప్లేయర్ రఫా పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత నాదల్ రెండో సెట్‌లో పుంజుకుని అందులో గెలిచాడు. అయితే తర్వాత జరిగిన రెండు సెట్లలోనూ ఓటమి పాలయ్యాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడు. అంతకుముందు ఆండీ రిడ్డిక్, జేమ్స్ బ్లేక్ రఫాను ఓడించారు. ఫ్రాన్సీస్ ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తొలి సెట్‌లో సునాయస విజయాన్ని అందుకున్న ఫ్రాన్సీస్‌కు.. రెండో సెట్‌లో రఫా నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆ సెట్‌లో ఓటమి పాలయ్యాడు. అనంతరం మూడో సెట్‌లో ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6-4 తేడాతో విజయం సాధించాడు. ఇక నాలుగో సెట్‌ను కూడా సులభంగానే గెలుపును సాధించాడు.
ఈ ఏడాది నాదల్‌కు ఇదే తొలి ఓటమి. నాదల్ 2022 ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌తో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం తన ఫ్రేవరెట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ టైటిల్‌ను ముద్దాడి క్లే కోర్టులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాు. వింబుల్డన్ 2022లోనూ సెమీ ఫైనల్‌కు చేరాడు. అయితే గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సెమీస్‌లో మెద్వెదేవ్‌తో తలపడాల్సి ఉండగా.. గాయంతో రఫా వైదొలగడంతో మెద్వెదేవ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
సంబంధిత కథనం