Sania Mirza: యూఎస్ ఓపెన్ నుంచి సానియా ఔట్.. రిటైర్మెంట్‌పై అప్‌డేట్
Sania Mirza: యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. అంతేకాదు తన రిటైర్మెంట్‌పై కూడా ఆమె కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది.
Sania Mirza: హైదరాబాద్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మంగళవారం (ఆగస్ట్ 23) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. మోచేతి గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇక దీని కారణంగా తన రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా మారిపోనున్నట్లు తెలిపింది.
"హాయ్ గయ్స్, ఓ అప్‌డేట్. ఇది అంత మంచి వార్తేమీ కాదు. రెండు వారాల కిందట కెనడాలో ఆడినప్పుడు నా చేయి/మోచేతికి గాయమైంది. నిన్న స్కాన్ తీయించే వరకూ ఆ గాయం తీవ్రత నాకు తెలియలేదు. నిజానికి కండరాల్లో కాస్త చీలిక కూడా ఉంది. అందుకే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా. కొన్ని వారాల పాటు దూరంగా ఉంటాను. ఇది దురదృష్టకరం. ఇది నా రిటైర్మెంట్ ప్లాన్స్‌ను కొంత మేర మార్చేస్తుంది. దీనిపై నేను మీకు అప్‌డేట్ ఇస్తాను" అని ఇన్‌స్టా స్టోరీ సానియా రాసింది.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తల్లి అయిన తర్వాత తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన సానియా మంచి ఫామ్‌లోనే ఉంది. కెరీర్‌లో ఆరు డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న 35 ఏళ్ల సానియా.. ఈ సీజన్ తర్వాత రిటైరవుతున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆమె మంచి ఆటతీరు వల్ల ర్యాంకింగ్స్ కూడా మెరుగయ్యాయి
ఈ మధ్యే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లోనూ ఆడింది. వింబుల్డన్ సెమీఫైనల్లో ఆమె ఓడిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ కు ముందు సానియా మీర్జా హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడింది. తల్లి అయిన తర్వాత తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టి ఇలా రాణించడం నిజంగా అదృష్టమని ఆమె చెప్పింది.
సంబంధిత కథనం
టాపిక్