Rohit Sharma Body Shaming Comments: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మ పై బాడీ షేమింగ్ కామెంట్స్
04 March 2023, 8:08 IST
Rohit Sharma Body Shaming Comments: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్‌శర్మపై టీమ్ ఇండియా అభిమానులు బాడీ షేమింగ్స్ కామెంట్స్ చేశారు. అతడిని వడపావ్ అంటూ పేర్కొనడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రోహిత్‌శర్మ
Rohit Sharma Body Shaming Comments: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమ్ ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ధాటికి రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ మూడు వందల పరుగులు కూడా చేయలేకపోయారు.
ఈ దారుణ పరాజయాన్ని టీమ్ ఇండియా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా మూడో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టార్గెట్‌ను చేరువ అవుతోన్న సమయంలో కొందరు అభిమానులు రోహిత్‌శర్మను ఉద్దేశించి వడపావ్ అంటూ నినాదాలు చేయడం కనిపించింది.
గత కొన్నాళ్లుగా రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై విమర్శలొస్తోన్న సంగతి తెలిసింది. రోహిత్ శర్మ ఓవర్‌వెయిట్‌తో కనిపిస్తోన్నాడని, అతడు బరువు తగ్గాలని ఇటీవలే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అభిమానుల వ్యాఖ్యలతో మరోసారి రోహిత్ శర్మ ఫిట్‌నెస్ అంశం తెరపైకి వచ్చింది. అయితే సొంత అభిమానులే రోహిత్‌శర్మపై బాడీ షేమింగ్స్ కామెంట్స్ చేయడాన్ని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు.