తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sanju Samson: ఇండియా ఎప్పటికీ వరల్డ్‌కప్‌ గెలవదు.. సంజు శాంసన్‌కు అన్యాయంపై ఫ్యాన్స్‌ సీరియస్‌

Sanju Samson: ఇండియా ఎప్పటికీ వరల్డ్‌కప్‌ గెలవదు.. సంజు శాంసన్‌కు అన్యాయంపై ఫ్యాన్స్‌ సీరియస్‌

Hari Prasad S HT Telugu

01 July 2022, 11:00 IST

google News
    • Sanju Samson: టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు మరోసారి అన్యాయం జరగడంపై ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు. ఇలా అయితే ఇండియా ఎప్పటికీ వరల్డ్‌కప్‌ గెలవదంటూ బీసీసీఐపై తీవ్రంగా మండిపడుతున్నారు.
సంజు శాంసన్
సంజు శాంసన్ (PTI)

సంజు శాంసన్

న్యూఢిల్లీ: ఇండియన్‌ టీమ్‌లో సంజు శాంసన్‌ది ఓ వింత స్టోరీ. టీమ్‌లోకి ఇలా రావడం, అలా వెళ్లడం అతనికి అలవాటుగా మారింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా బ్యాట్‌తో మెరుపులు మెరిపించే శాంసన్‌.. ఇండియన్‌ టీమ్‌లో తన స్థాయికి తగిన ఆట ఆడకపోయినా ఫర్వాలేదనిపించాడు. రీసెంట్‌గా ఐర్లాండ్‌తో ఆడిన టీ20ల్లో 77 రన్స్‌ చేశాడు.

అయినా అతనికి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. కేవలం తొలి టీ20 మాత్రమే సంజు శాంసన్‌కు చోటిచ్చారు. అది కూడా విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌లాంటి ప్లేయర్స్‌ ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ ఆడుతూ బిజీగా ఉండటం వల్ల అతనికి ఛాన్స్‌ దక్కింది. వాళ్లు రెండో టీ20 నుంచి అందుబాటులో ఉండటంతో శాంసన్‌ను పక్కన పెట్టారు.

దీంతో అతని ఫ్యాన్స్‌ బీసీసీఐపై గుర్రుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దారుణంగా ఫెయిలవుతున్న రిషబ్‌ పంత్‌ను కొనసాగిస్తూ సంజు శాంసన్‌ను పక్కడపెట్టడమేంటని ఒకరు ప్రశ్నించారు. ఇక మరొక అభిమాని అయితే.. సంజు శాంసన్‌ రిటైర్‌ కావాలని, ఆ తర్వాత ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియా టీమ్స్‌కు ఆడాలని సూచించడం విశేషం.

మరో ట్విటర్‌ యూజర్‌ స్పందిస్తూ.. ఇలా అయితే టీమిండియా ఎప్పటికీ వరల్డ్‌కప్‌ గెలవదని బీసీసీఐకి శాపనార్థాలు పెట్టాడు. అతడు ఆడినా, ఆడకపోయినా శాంసన్‌ టాలెంట్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మరొకరు మండిపడ్డారు. బాలీవుడ్‌లో నెపోటిజం ఉన్నట్లే ఇండియన్‌ క్రికెట్‌లోనూ ఉన్నదని, సంజు శాంసన్‌కు అండగా ఉండాలని మరో ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేశారు.

సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిన మాట వాస్తవేమనని సబా కరీమ్‌లాంటి మాజీ చీఫ్‌ సెలక్టర్లు కూడా చెప్పడం గమనార్హం. అయితే ఇవన్నీ పక్కపెట్టి అతడు భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని సబా కరీమ్‌ అన్నాడు. ప్రస్తుతం ఇండియన్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్లు చాలా మందే ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌ కోసం కూడా రిషబ్‌ పంత్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌, దినేష్‌ కార్తీక్‌ పోటీ పడుతున్నారు. సంజు శాంసన్‌ కూడా వికెట్‌ కీపరే. అయితే అతన్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు పక్కన పెట్టిన సెలక్టర్లు.. వరల్డ్‌కప్ టీమ్‌ రేసులో అతడు లేడని చెప్పకనే చెప్పినట్లయింది.

తదుపరి వ్యాసం