తెలుగు న్యూస్  /  Sports  /  Dravids Son Anvay Dravid As Captain Of Karnataka Under 14 Team

Dravid's Son as Captain: కర్ణాటక టీమ్ కెప్టెన్‌గా ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్

Hari Prasad S HT Telugu

19 January 2023, 17:38 IST

    • Dravid's Son as Captain: కర్ణాటక టీమ్ కెప్టెన్‌ అయ్యాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్. అతడు కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు.
అన్వయ్ ద్రవిడ్
అన్వయ్ ద్రవిడ్

అన్వయ్ ద్రవిడ్

Dravid's Son as Captain: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక అండర్-14 టీమ్ కెప్టెన్ అయ్యాడు. అతడు ఓ ఇంటర్ జోనల్ టోర్నమెంట్ లో కర్ణాటకను లీడ్ చేయనున్నాడు. జూనియర్ క్రికెట్ లో అన్వయ్ చాలా రోజులుగా బ్యాట్ తో రాణిస్తున్నాడు. తరచూ తన ప్రదర్శనతో అన్వయ్ వార్తల్లో నిలుస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీంతో ఇప్పుడతన్ని టీమ్ కెప్టెన్ గా నియమించారు. అన్వయ్ వికెట్ కీపర్ కూడా. రాహుల్ ద్రవిడ్ కూడా టీమిండియాకు ఆడే సమయంలో వన్డే టీమ్ కు చాలా రోజుల పాటు రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్న విషయం తెలిసిందే. ధోనీ టీమ్ లోకి వచ్చే ముందు వికెట్ కీపర్ లేక ఇబ్బంది పడుతున్న టీమ్ ను ద్రవిడ్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ఆదుకున్నాడు.

ధోనీ వచ్చిన తర్వాత ద్రవిడ్ మళ్లీ స్పెషలిస్ట్ బ్యాటర్ గా టీమ్ లో కొనసాగాడు. ఇప్పుడు అన్వయ్ కూడా తన తండ్రిలాగే అండర్ 14 టీమ్ భారాన్ని మోస్తున్నాడు. అన్వయ్ అన్న, ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ కూడా క్రికెటరే. సమిత్ కూడా 2019-20 సీజన్ లో అండర్ 14 క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలతో వార్తల్లో నిలిచాడు. ఈ లెవల్లో సమిత్ ఇప్పటికే పేరు సంపాదించగా.. అన్వయ్ ఇప్పుడిప్పుడే తన తండ్రి, అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు.

మరోవైపు ద్రవిడ్ టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది రవిశాస్త్రి నుంచి అతడు బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడతడు ఇండియన్ టీమ్ తో కలిసి న్యూజిలాండ్ సిరీస్ లో ఉన్నాడు. తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. ఇప్పుడు రెండో వన్డే కోసం సిద్ధమవుతోంది.

టాపిక్