Team India Coach Laxman: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌కు ప్రమోషన్? - ద్రావిడ్‌కు గుడ్‌పై చెప్పనున్నారా
03 January 2023, 10:05 IST
Team India Coach Laxman: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వీవీఎస్ లక్ష్మణ్
Team India Coach Laxman: ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తోన్నాయి. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కోచ్‌గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. వన్డే వరల్డ్‌కప్‌తో హెడ్ కోచ్‌గా ద్రావిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది.
పదవీ కాలాన్ని పొడగించే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ద్రావిడ్ కూడా కోచ్ పదవిలో కొనసాగడానికి ఆసక్తిని చూపడం లేదని అంటున్నారు. ద్రావిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించనున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని సిరీస్‌లకు ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ టీమ్ ఇండియాకు కోచ్‌గా వ్యవహరించాడు.
టీమ్ ఇండియా ఏ జట్టుతో పాటు అండర్ 19 టీమ్‌కు కోచ్‌గా సమర్థవంతంగా లక్ష్మణ్ బాధ్యతల్ని నిర్వర్తించాడు. అవన్నీ పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ వర్గాలు కోచ్‌గా లక్ష్మణ్ ఎంపిక చేయడమే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించే విషయమై సోమవారం జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ మీటింగ్‌కు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జయ్‌షాతో పాటు ద్రావిడ్, లక్ష్మణ్, చేతన్ శర్మ హాజరైనట్లు తెలిసింది. మరోవైపు వన్డే వరల్డ్ కప్ రిజల్ట్ తర్వాతే ద్రావిడ్ విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నట్లు తెలిసింది.
ఈ వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా మంచి ఫలితాల్ని సాధిస్తే ద్రావిడ్‌ను కోచ్‌గా కొనసాగిస్తే మంచిదని కొందరు బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కొనసాగుతోన్నాడు లక్ష్మణ్. హెడ్ కోచ్ మార్పుపై వన్డే వరల్డ్ కప్ తర్వాతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.