తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  De Villiers About Surya Kumar: వావ్‌.. సూర్యకుమార్‌కు ఇంతకు మించిన ప్రశంస ఉండదేమో!

De Villiers about Surya Kumar: వావ్‌.. సూర్యకుమార్‌కు ఇంతకు మించిన ప్రశంస ఉండదేమో!

Hari Prasad S HT Telugu

07 November 2022, 8:34 IST

google News
    • De Villiers about Surya Kumar: వావ్‌.. సూర్యకుమార్‌కు ఇంతకు మించిన ప్రశంస ఉండదేమో అనిపిస్తుంది అతని గురించి ఏబీ డివిలియర్స్‌ అన్న మాట చూస్తుంటే. జింబాబ్వేతో మ్యాచ్‌ తర్వాత ఒకే లైన్‌లో సూర్యను ఆకాశానికెత్తాడు ఈ సౌతాఫ్రికా లెజెండ్‌.
ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్
ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్

ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్

De Villiers about Surya Kumar: సూర్యకుమార్‌ యాదవ్‌ క్రికెట్‌లో ఓ లేటెస్ట్‌ సెన్సేషన్‌. ముఖ్యంగా టీ20ల్లో అతని ఆటకు ఫిదా కాని క్రికెట్‌ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు అతనిలో మరో ఏబీ డివిలియర్స్‌ను చూసుకుంటున్నారు. మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌గా ఈ సౌతాఫ్రికా లెజెండ్‌కు పేరుండేది.

అతడు రిటైరైన తర్వాత ఆ స్థానాన్ని సూర్య భర్తీ చేస్తున్నాడంటూ చాలా రోజులుగా క్రికెట్ పండితులు కూడా అంటున్నారు. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్‌తో సూర్య మరోసారి అదే నిరూపించాడు. కేవలం 25 బాల్స్‌లోనే 61 రన్స్‌ బాదిన సూర్య.. తనను 360 డిగ్రీ ప్లేయర్‌ అని ఎందుకంటారో చూపించాడు.

గ్రౌండ్ నలుమూలలా వినూత్నమైన కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ఒక దశలో టీమిండియా స్కోరు 160 అయితే చాలా ఎక్కువ అనుకునే సమయంలో ఏకంగా 180 దాటిందంటే అది సూర్య మెరుపుల వల్లే. ఈ ఇన్నింగ్స్‌ చూసిన తర్వాత ఏబీ డివిలియర్స్‌తో సూర్యను పోలుస్తున్న విషయాన్ని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తనతో చెప్పాడు. దీనికి సూర్య స్పందిస్తూ.. ప్రపంచంలో ఒకే ఒక్క 360 డిగ్రీ ప్లేయర్‌ ఉన్నాడు.. నేను అతనిలాగా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు.

ఈ రిప్లై చూసి డివిలియర్స్‌ ఫిదా అయిపోయాడు. దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ.. "నువ్వు చాలా త్వరగా ఆ స్థాయికి చేరుకుంటున్నావు.. నిజానికి అంతకంటే ఎక్కువే! ఇవాళ చాలా బాగా ఆడావు" అంటూ మెచ్చుకున్నాడు. 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన డివిలియర్సే సూర్యపై ఈ రేంజ్‌లో ప్రశంసలు కురిపించడం నిజంగా విశేషమే.

అటు మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా సూర్యను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. "విరాట్ కోహ్లి, రాహుల్‌, రోహిత్‌ లాంటి వాళ్లంతా సాంప్రదాయ ప్లేయర్స్. సూర్యకుమార్‌ భిన్నమైనవాడు. అతడు ఆటను బాగా ఎంజాయ్‌ చేస్తాను. ఇలాంటి ప్లేయర్‌ చాలా అరుదుగా దొరుకుతారు. ఇండియన్‌ టీమ్‌కు అందులోనూ నంబర్‌ 4లో ఎప్పుడూ ఇలాంటి ప్లేయర్‌ లేడు. ఒకవేళ ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచినా, గెలవకపోయినా సూర్యనే నా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌. సాంప్రదాయ ప్లేయర్స్‌ నిలకడగా ఆడతారు కానీ సూర్యలాంటి ప్లేయర్‌ 180 స్ట్రైక్‌రేట్‌తో 200కుపైగా రన్స్‌, మూడు హాఫ్ సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. అతడు ఇప్పటికే అత్యుత్తమ ప్లేయర్‌" అని గంభీర్‌ ఆకాశానికెత్తాడు.

సూర్య గురించి డివిలియర్స్ చేసిన ట్వీట్
తదుపరి వ్యాసం