తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lsg Vs Kkr | ఒకే ఓవర్లో 30 పరుగులు.. లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ స్కోరు

LSG vs KKR | ఒకే ఓవర్లో 30 పరుగులు.. లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ స్కోరు

Hari Prasad S HT Telugu

07 May 2022, 21:16 IST

google News
    • కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ భారీ స్కోరు చేసింది. చివర్లో ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లతో లక్నో బ్యాటర్లు చెలరేగారు.
హాఫ్ సెంచరీ చేసిన క్వింటన్ డీకాక్
హాఫ్ సెంచరీ చేసిన క్వింటన్ డీకాక్ (PTI)

హాఫ్ సెంచరీ చేసిన క్వింటన్ డీకాక్

పుణె: 18 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో స్కోరు 142. తర్వాత ఓవర్‌కు 10 రన్స్‌ చేసినా మహా అయితే 160 పరుగులు అవుతాయేమో అనుకున్నారు. కానీ ఆ టీమ్‌ 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లకు 176 రన్స్‌ చేసింది. దీనికి కారణం శివమ్‌ మావి వేసిన 19వ ఓవర్‌. ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. మొదట మార్కస్‌ స్టాయినిస్‌ మూడు వరుస సిక్స్‌లు బాది నాలుగో బంతికి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన జేసన్‌ హోల్డర్‌ మిగిలి రెండు బంతులను కూడా సిక్స్‌లుగా మలిచాడు.

ఈ ఓవర్‌ దెబ్బకు శివమ్ మావి 4 ఓవర్ల కోటాలో 50 రన్స్ సమర్పించుకున్నాడు. అయితే చివరి ఓవర్‌ వేసిన టిమ్‌ సౌథీ కేవలం 4 రన్స్‌ ఇచ్చి లక్నో మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగాడు. లక్నో బ్యాటర్లలో డీకాక్‌ హాఫ్ సెంచరీ చేయగా.. స్టాయినిస్‌ 14 బంతుల్లో 28, హోల్డర్‌ 4 బంతుల్లో 13 రన్స్‌ చేశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్‌, టాప్‌ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ (0) ఒక్క బాల్‌ కూడా ఆడకుండానే రనౌటయ్యాడు. మొదట పరుగు కోసం పిలిచిన డీకాక్‌.. తర్వాత వద్దనడంతో రాహుల్‌ తిరిగి క్రీజులోకి చేరుకోలేకపోయాడు. అయితే రాహుల్‌ ఔటైనా.. డీకాక్‌ చెలరేగిపోయాడు. కేవలం 27 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 రన్స్ చేశాడు. ఆ వెంటనే ఔటయ్యాడు.

ఆ తర్వాత ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న దీపక్‌ హుడా కూడా చెలరేగాడు. అతడు కేవలం 27 బాల్స్‌లో 41 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు కృనాల్‌ పాండ్యా కాసేపు క్రీజులో ఉన్నా.. 27 బంతుల్లో 25 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 4 ఓవర్లలో కేవలం 20 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం