తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Warner Plays Street Cricket: ముంబైలో గ‌ల్లీ క్రికెట్ ఆడిన వార్న‌ర్ - వీడియో వైర‌ల్

Warner Plays Street Cricket: ముంబైలో గ‌ల్లీ క్రికెట్ ఆడిన వార్న‌ర్ - వీడియో వైర‌ల్

16 March 2023, 13:14 IST

  • Warner Plays Street Cricket: ముంబైలో కొంద‌రు కుర్రాళ్ల‌తో క‌లిసి గ‌ల్లీ క్రికెట్ ఆడాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 డేవిడ్ వార్న‌ర్‌
డేవిడ్ వార్న‌ర్‌

డేవిడ్ వార్న‌ర్‌

Warner Plays Street Cricket: మోచేయి గాయంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్ నుంచి అర్ధాంత‌రంగా వైదొలిగాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోయిన వార్న‌ర్ తిరిగి ఇటీవ‌లే ఇండియా వ‌చ్చాడు. శుక్ర‌వారం నుంచి ఇండియాతో మొద‌లుకానున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు వార్న‌ర్ ఎంపిక‌య్యాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ వ‌న్డే సిరీస్ కోసం రెండు, మూడు రోజ‌లు ముందే ఇండియా చేరుకున్నాడు వార్న‌ర్‌. తొలి వ‌న్డే ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగ‌నుంది. ఈ వ‌న్డే మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీమ్ ముంబై చేరుకుంది.

మ్యాచ్‌కు ముందు విరామం ల‌భించ‌డంతో త‌న ఫ్యామిలీతో క‌లిసి ముంబై వీధుల్లో వార్న‌ర్ చ‌క్క‌ర్లు కొట్టాడు. ముంబైల లోని ఓ వీధిలో కుర్రాళ్ల‌తో క‌లిసి గ‌ల్లీ క్రికెట్ ఆడాడు వార్న‌ర్‌. గ‌ల్లీ క్రికెట్ ఆడుతోన్న వీడియోను వార్న‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇందులో ఓ యువ‌కుడు వేసిన బాల్‌ను డిఫెన్స్ ఆడుతూ వార్న‌ర్ క‌నిపించాడు. వార్న‌ర్ గ‌ల్లీ క్రికెట్ ఆడుతోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోకి మూడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి.

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌ను ఇండియ‌న్స్ ఎందుకు ఆరాధిస్తారో మిమ్మ‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది అంటూ వార్న‌ర్ పోస్ట్ చేసిన‌ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇంట‌ర్‌నేష‌న్ క్రికెట్ కంటే గ‌ల్లీ క్రికెట్ ఆడ‌టం ఎంత క‌ష్ట‌మో వార్న‌ర్‌కు అర్థ‌మై ఉంటుంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.