తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 | టాస్ గెలిచిన చెన్నై...ముంబై బ్యాటింగ్

IPL 2022 | టాస్ గెలిచిన చెన్నై...ముంబై బ్యాటింగ్

HT Telugu Desk HT Telugu

21 April 2022, 19:04 IST

google News
  • ఐపీఎల్ లో గురువారం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించి బోణీ చేయాలని ముంబై ఆశిస్తోంది. రెండో గెలుపు కోసం చెన్నై కసరత్తులు చేస్తోంది. 

రోహిత్ శర్మ, జడేజా
రోహిత్ శర్మ, జడేజా (twitter)

రోహిత్ శర్మ, జడేజా

గురువారం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఐపీఎల్ 2022 సీజన్ లో ఫేవరేట్స్ గా బరిలోకి దిగాయి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఈ రెండింటిలో ఏదో ఒక టీమ్ కప్ గెలుస్తుందని క్రికెట్ అభిమానులు ఊహించారు. కానీ అందరి అంచనాల్ని తలక్రిందులు  చేస్తూ ఈ సీజన్ లో చెన్నై, ముంబై పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో ముంబై బోణీ చేయలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ లలో ముంబై విఫలమవుతోంది. 

రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకూమార్ యాదవ్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ మొత్తం తేలిపోతున్నారు.  వారికి సహకారం అందించేవారు కరువయ్యారు.  బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బుమ్రాతో పాటు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసే వారు కనిపించడం లేదు.  జయదేవ్ ఉనద్కద్, మురుగన్ అశ్విన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. చెన్నైతో జరిగే మ్యాచ్ తో బోణీ కొట్టి తమపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలని ముంబై భావిస్తోంది. ఈ మ్యాచ్ తో ముంబై తరఫున మెరిడిత్, హృతిక్ షోకిన్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశారు. 

రెండో గెలుపు కోసం

మరోవైపు చెన్నై పరిస్థితి కూడా గొప్పగాలేదు. ఆరు మ్యాచులు ఆడిన చెన్నై ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కొత్త కెప్టెన్ జడేజా సారథ్యంలో టీమ్ ఇంకా కుదురుకోలేదు. రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటిరాయుడు, రుతురాజ్ గైక్వాడ్ పైనే చెన్నై బ్యాటింగ్ భారం ఉంది. మరోవైపు బౌలింగ్ బ్రావో, జడేజా, మెయిన్ అలీ రాణిస్తేనే ముంబైపై చెన్నై గెలవగలదు. 

టాపిక్

తదుపరి వ్యాసం