తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni | ఐపీఎల్‌కు ముందు కొత్త అవతారంలో ధోనీ.. గుర్తుపట్టగలరేమో చూడండి!

MS Dhoni | ఐపీఎల్‌కు ముందు కొత్త అవతారంలో ధోనీ.. గుర్తుపట్టగలరేమో చూడండి!

Hari Prasad S HT Telugu

27 February 2022, 10:03 IST

    • ఇండియన్ టీమ్‌ మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ ఐపీఎల్‌కు ముందు కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ కొత్త అవతారంలో అతడు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.
కొత్త లుక్ లో కనిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ
కొత్త లుక్ లో కనిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ (Twitter)

కొత్త లుక్ లో కనిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ

చెన్నై: ఐపీఎల్‌ వస్తుందంటే చాలు ప్రమోషన్లు మొదలవుతాయి. టాప్‌ క్రికెటర్లు కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తుంటారు. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌ కోసం ఓ ప్రమోషనల్‌ వీడియోలో కొత్త లుక్‌లో కనిపించాడు. ఖాకీ ప్యాంటు, షర్టు వేసుకొని, పెద్ద పెద్ద మీసాలు, జుట్టుతో ఓ బస్‌ డ్రైవర్‌లా చాలా వెరైటీగా కనిపిస్తున్నాడు. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సడెన్‌గా చూస్తే అతడు ధోనీ అని గుర్తు పట్టడం దాదాపు అసాధ్యం. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియోను రూపొందించింది. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ధోనీ కొత్త లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అసలు ఈ వీడియోలో ధోనీ ఏంటి? ఏంచెప్పబోతున్నాడన్నది సస్పెన్స్‌గా ఉంచింది స్టార్‌ స్పోర్ట్స్‌. ఈ మధ్యే బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌తో కలిసి మరో కమర్షియల్‌లో నటించాడు ధోనీ. క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో జులపాల జుట్టుతో కనిపించిన ధోనీ.. తర్వాత తన హెయిర్‌స్టైల్‌ను ఎన్నో రకాలుగా మార్చాడు. ఇప్పుడు కూడా ఓ కొత్త లుక్‌లో ధోనీ కనిపిస్తున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం