తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cheteshwar Pujara: సెంచరీతో చెలరేగిన పుజార.. టీమిండియా నుంచి తప్పించిన కొన్ని రోజులకే..

Cheteshwar Pujara: సెంచరీతో చెలరేగిన పుజార.. టీమిండియా నుంచి తప్పించిన కొన్ని రోజులకే..

07 July 2023, 17:14 IST

google News
    • Cheteshwar Pujara: దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‍లో సెంచరీతో అదరగొట్టాడు భారత సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజార. టీమిండియా టెస్టు జట్టు నుంచి తప్పించిన కొన్ని రోజులకే మరోసారి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.
చెతేశ్వర్ పుజార
చెతేశ్వర్ పుజార (AFP)

చెతేశ్వర్ పుజార

Cheteshwar Pujara: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజార తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించాడు. వెస్టిండీస్ పర్యటనలో భారత టెస్టు జట్టు నుంచి తనను తప్పించటంతో.. ప్రస్తుతం దేశవాళీ దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ టీమ్ తరఫున ఆడుతున్నాడు పుజార. అలుర్ వేదికగా సెంట్రల్ జోన్‍తో జరుగుతున్న కీలకమైన దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‍లో రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టాడు చెతేశ్వర్. కష్టాల్లో ఉన్న వెస్ట్ జోన్ జట్టును రక్షించాడు.

50 పరుగుల వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజైన నేడు బ్యాటింగ్ కొనసాగించాడు చెతేశ్వర్ పుజార. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా తాను మాత్రం ధీటుగా ఆడాడు. మొత్తంగా 278 బంతుల్లో 133 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.

పుజారాతో కలిసి మూడో రోజు బ్యాటింగ్‍కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (6) త్వరగా ఔటయ్యాడు. పుజారాకు హెట్ పటేల్ (27) కాసేపు సహకారం అందించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అతిత్ సేత్ (9) కూడా పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఎండ్‍లో మాత్రం పుజార.. సెంట్రల్ జోన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. చివరికి 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. వెస్ట్ జోన్ జట్టు 9 వికెట్లకు 292 పరుగుల వద్ద ఉండగా.. వర్షం ఆటకు ఆటంకం కలిగించింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ 384 పరుగుల ఆధిక్యంతో ఉంది.

ఈ దులీప్ ట్రోఫీ సెమీస్ తొలి ఇన్నింగ్స్‌లో 102 బంతులను ఎదుర్కొన్న పుజార.. 28 పరుగులకే శివమ్ మావీ బౌలింగ్‍లో ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వచ్చిన అవకాశాన్ని మాత్రం ఒడిసిపట్టుకొని శకతంతో సత్తాచాటాడు. అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విజయ్ హజారే (60 సెంచరీలు)ను పుజార సమం చేశాడు. సునీల్ గవాస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68) వెనుక నిలిచాడు పుజార.

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో విఫలమయ్యాక టీమిండియా టెస్టు జట్టు నుంచి పుజారను సెలెక్టర్లు తప్పించారు. వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు అతడిని ఎంపిక చేయలేదు. అయితే, పుజారాను జట్టు నుంచి తప్పించడాన్ని సునీల్ గవాస్కర్ సహా మరికొందరు తప్పుబట్టారు. జట్టులో చాలా మంది విఫలమైతే పుజార ఒక్కడిపైనే వేటు ఎందురు వేశారని ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం