తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Carlos Alcaraz In Us Open Finals: యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో కార్లోస్.. నాదల్ తర్వాత అరుదైన ఘనత సాధించిన స్పెయిన్ స్టార్

Carlos Alcaraz in US Open Finals: యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో కార్లోస్.. నాదల్ తర్వాత అరుదైన ఘనత సాధించిన స్పెయిన్ స్టార్

10 September 2022, 10:10 IST

google News
    • US Open 2022 Semis: యూఎస్ ఓపెన్ 2022 సెమీస్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కారాజ్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. లోకల్ ఫేవరెట్ ఫ్రాన్సీస్ టియాఫేపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించాడు.
కార్లోస్ అల్కారాజ్
కార్లోస్ అల్కారాజ్ (AFP)

కార్లోస్ అల్కారాజ్

Carlos Alcaraz in US Open Finals: దిగ్గజ ఆటగాళ్లు యూఎస్ ఓపెన్‌కు దూరం కావడంతో ఈ గ్రాండ్‌స్లామ్ చప్పగా సాగుతుందని భావించారు. స్పెయిన్ బుల్ నాదల్ నాలుగో రౌండులోనే నిష్క్రమించగా.. సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ వ్యాక్సినేషన్ కారణంగా టోర్నీకే దూరమయ్యాడు. దీంతో ఫైనల్‌పై ఆసక్తి తగ్గింది. అయితే ఎలాంటి అంచానాల్లేకుండా స్పెయిన్ టెన్నిస్ స్టార్, మూడో సీడ్ కార్లోస్ అల్‌కార్జ్ అదిరిపోయే రీతిలో విజృంభించాడు. యూఎస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలుచున్నాడు. శుక్రవారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీస్ మ్యాచ్‌లో లోకల్ ఫేవరెట్ ఫ్రాన్సీస్ టియాఫేపై విజయం సాధించి.. తుదిపోరుకు అర్హత సాధించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరడం కార్లోస్‌కు ఇదే మొదటిసారి.

కార్లోస్ తీవ్రంగా శ్రమించి చెమటొడ్చి విజయాన్ని అందుకున్నాడు. 4 గంటల 18 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో చివరకు కార్లోస్‌నే విజయం వరించింది. అమెరికన్ క్రీడాకారుడు ఫ్రాన్సీస్ టియాఫేపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించాడు. అర్థర్ స్టేడియం వేదికగా నువ్వా, నేనా అంటూ సాగిన పోరులో విజయం స్పానిష్ ప్లేయర్‌నే వరించింది. కార్లోస్ ఆదివారం నాడు జరగనున్న ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ క్యాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు.

ఆల్కరాజ్, టియాఫే ఇద్దరూ నిలకడగా గ్రౌండ్‌స్ట్రోక్‌లను కొట్టారు. అంతేకాకుండా దూకుడుగా ఆడారు. కార్లోస్ వరుస సర్వీస్‌లు, గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ప్రారంభ సెట్‌లో నాలుగు పాయింట్లను కాపాడుకున్నాడు. కానీ సెట్ కార్లోస్‌కు అనుకూలంగా వెళుతున్నట్లు అనిపించినప్పుడు, టియాఫే కూల్ ఆడి టైబ్రేక్‌లో మొదటి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇలా ప్రత్యర్థి నుంచి ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఇద్దరూ దూకుడుగా ఆడారు. కానీ అనంతరం పుంజుకున్న కార్లోస్ చివరి వరకు పోరాడి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

యూఎస్ ఓపెన్‌లో ముగ్గురు ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. రఫెల్ నాదల్, క్సాస్పర్ రూడ్, కార్లోస్ మధ్య పోటీ ఉంటుందని క్రీడాభిమానులు ఊహించారు. అయితే నాదల్‌ను ఫ్రాన్సీస్ నాలుగో రౌండులో ఓడించడంతో.. రేసు కాస్పర్, కార్లోస్ మధ్య జరగనుంది. టియాఫేను తాజా కార్లోస్ ఓడించి ఫైనల్‌కు చేరాడు. మరోపక్క క్యాస్పర్ రూడ్.. కరెన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. 2019 నుంచి నాదల్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడిగా కార్లోస్ రికార్డు సృష్టించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం