తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli - Nzt20 Series: టీ20ల నుంచి కోహ్లి, రోహిత్‌ల‌కు ఉద్వాస‌న? - బీసీసీఐ మౌనం వెనుక అర్థం ఏమిటి?

Virat Kohli - NzT20 Series: టీ20ల నుంచి కోహ్లి, రోహిత్‌ల‌కు ఉద్వాస‌న? - బీసీసీఐ మౌనం వెనుక అర్థం ఏమిటి?

HT Telugu Desk HT Telugu

14 January 2023, 18:42 IST

google News
  • Virat Kohli - NzT20 Series: త్వ‌ర‌లో స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రుగ‌నున్న సిరీస్ కోసం స్టార్‌ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌ను టీ20ల నుంచి త‌ప్పించిన బీసీసీఐ కేవ‌లం వ‌న్డేల‌లో మాత్ర‌మే చోటిచ్చింది. టీ20ల నుంచి వారిని త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాల్ని వెల్ల‌డించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి
రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి

Virat Kohli - NzT20 Series: త్వ‌ర‌లో స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రుగ‌నున్న వ‌న్డే, టీ20 సిరీస్ కోసం భార‌త జ‌ట్ల‌ను శుక్ర‌వారం బీసీసీఐ ప్ర‌క‌టించింది. వ‌న్డే, టీ20 సిరీస్ కోసం వేర్వేరు టీమ్‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో వ‌న్డే జ‌ట్టులో సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కోహ్లి, రోహిత్‌ల‌కు చోటిచ్చిన బీసీసీఐ టీ20ల‌కు మాత్రం వారిని దూరం పెట్టింది. టీ20ల‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌ను ఎంపిక‌చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని సెల‌క్ష‌న్ క‌మిటీ వెల్ల‌డించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

ఫ్యామిలీ క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కె.ఎల్ రాహుల్‌, అక్ష‌ర్ ప‌టేల్ దూరంగా ఉన్న‌ట్లు సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. కానీ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి టీ20 సిరీస్‌కు ఎందుకు దూర‌మ‌య్యార‌నే దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఈ విష‌యంలో సెలెక్ష‌న్ క‌మిటీ మౌనం పాటించ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త కొంత‌కాలంగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిని టీ20 టీమ్ నుంచి పూర్తిగా త‌ప్పించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి బీసీసీఐ దానిని అమ‌లు చేయ‌నున్న‌ట్లు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే వారిని న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేద‌ని అంటున్నారు.

వ‌న్డే, టెస్ట్‌ల‌కు వారిని ప‌రిమితం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌పై కోహ్లి, రోహిత్ టీ20 టీమ్‌లో క‌నిపించ‌క‌పోవ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రోహిత్‌, కోహ్లి ఎంపిక‌చేయ‌క‌పోవ‌డంపై బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా కూడా సైలెంట్‌గా ఉండ‌టం హాట్ టాపిక్‌గా మారింది.బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీపై రోహిత్‌, కోహ్లి అభిమానులు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

తదుపరి వ్యాసం