తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Squad : భారత జట్టులో కీలక మార్పులు

Team India Squad : భారత జట్టులో కీలక మార్పులు

Anand Sai HT Telugu

14 January 2023, 6:05 IST

google News
    • BCCI Announces Team India Squad : న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు జట్టులో మార్పులు చేసింది.
టీమిండియా
టీమిండియా (AP)

టీమిండియా

Team India Squad : న్యూజిలాండ్‌తో వన్డే, టీ20, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు టీమిండియా జట్టును ప్రకటించింది. ముందుగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కివీస్‌తో సిరీస్ కోసం బీసీసీఐ(BCCI) ప్రకటించిన జట్టులో కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ అక్షర్ పాటిల్ పేర్లు లేవు. రాహుల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ, వ్యక్తిగత కారణాల వల్ల అక్షర్ పాటిల్ అందుబాటులో ఉండకపోవడమే కారణంగా తెలుస్తోంది. కివీస్, ఆసీస్ సిరీస్‌ల కోసం భారత జట్టులో ఎవరు చోటు సంపాదించారో ఇక్కడ చూడండి.

న్యూజిలాండ్‌తో జరిగే టీ20(T20) జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి హార్దిక్ పాండ్యా(hardik pandya)కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లి(Virat Kohli)కి విశ్రాంతి ఇవ్వగా, పృథ్వీ షాకు అవకాశం లభించింది. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను తీసుకున్నారు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి పృథ్వీ షా, ముఖేష్ కుమార్

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా

న్యూజిలాండ్ సిరీస్ తర్వాత, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌లో ప్రారంభ 2 మ్యాచ్‌లకు టీమ్ ఇండియా జట్టును ప్రకటించారు. న్యూజిలాండ్‌తో జరిగే ODI, T20 సిరీస్‌లకు దూరంగా ఉండే KL రాహుల్, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు తిరిగి వస్తాడు. గాయం కారణంగా చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న రవీంద్ర జడేజా మళ్లీ టెస్టు జట్టులోకి రానున్నాడు.

తదుపరి వ్యాసం